'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా సత్తా చాటుతోంది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ లోనే అంత మొత్తాన్ని రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.330 కోట్లకు పైగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికినట్లు తెలుస్తోంది.

దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ.46 కోట్లు పలకగా.. హిందీ వెర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఓవర్సీస్ లో ఇప్పటివరకు సినిమా బిజినెస్ రూ.42 కోట్ల వరకు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా సినిమా శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ లెక్కలు చూస్తుంటే 'సాహో' సినిమా బాహుబలి రికార్డులను బద్దలుకొట్టే ప్లాన్ లో ఉందని అంటున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్ట్ 30న ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.