ట్రైలర్ చూసి రాజమౌళి స్పందించలేదంటూ గగ్గోలు ఎత్తిపోయిన వాళ్లు రిలాక్స్ అయ్యే న్యూస్ ఇది. సాహో సినిమా విషయంలో రాజమౌళి ఇచ్చిన సలహా ఇప్పుడు ఆ టీమ్ కు బంగారమైందట.  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళిని  పిలిపించి ప్రభాస్ తన తాజా చిత్రం సాహో ఫైనల్ కట్ చూపించారట. 

సూచనలు, సలహాలు అడిగిరాట. ఇండియాలో నెంబర్ వన్ డైరక్టర్స్ లో ఒకరుగా వెలుగుతున్న రాజమౌళితో ప్రబాస్ ఆల్రెడీ ఛత్రపతి, బాహబలి సినిమాలు చేసి ఉన్నాడు. దాంతో వాళ్లిద్దరి మధ్యా మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మొదట వేరే డైరక్టర్ సినిమా విషయంలో తను సలహా ఇవ్వటం బాగోదన్న రాజమౌళి..సుజీత్ కూడా కలిసి రిక్వెస్ట్ చేయటంతో చూసి కీలకమైన సూచన చేసారట.

ఈ సినిమా రన్ టైమ్  మూడు గంటల పైగా ఉందిట. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా లెంగ్తీగా ఉన్నాయిట. అవి బోర్ కొట్టే అవకాసం ఉందని భావించిన రాజమౌళి మొహమాటం లేకుండా ట్రిమ్ చేయమని చెప్పారట. అందుతున్న సమాచారం మేరకు రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫుల్ గా ట్రిమ్ చేసారని అంటున్నారు. దాంతో రన్ టైమ్ రెండు గంటల 52 నిముషాలకు వచ్చింది. 
 
 హెవీ యాక్షన్‌ ఎపిసోడ్లు వున్నాయి కనుక అంత లెంగ్త్‌ పెడితే అదే సినిమాకి మైనస్‌ అవుతుందని రాజమౌళి సూచనలు ఇవ్వడంతో ట్రిమ్ చేసి ఇలా ఫైనల్‌ రన్‌టైమ్‌ తీసుకొచ్చారు.  విజువల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ పూర్తి చేసుకున్న ఫైనల్‌ కట్‌లోంచి దీనిని తగ్గించారట. ఇప్పుడు ఫైనల్‌ కట్‌ చూసిన వారు చాలా స్పీడ్‌గా వుందని ఫీడ్‌బ్యాక్‌ ఇస్తున్నారట. దాంతో టీమ్ మొత్తం రాజమౌళికు ధాంక్స్ చెప్పుకున్నారట.