Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి విజయశాంతి?

కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. సినీ నటి విజయశాంతి కూడ బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

congress leader vijayashanti may join in bjp
Author
Hyderabad, First Published Aug 14, 2019, 7:11 AM IST

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సభను పురస్కరించుకొని పలు పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు గాలం వేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన ముఖ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడ బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా ఉన్న విజయశాంతి ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకొన్నారు. మహేష్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడ ఆమె నటించే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.

ఈ కారణంగానే ఆమె యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ రాహుల్ గాంధీ టీమ్ లో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆమె కొంత నిరాశతో ఉన్నట్టుగా చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడ పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించని కారణంగా ఆమె దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

మాజీ డిప్యూటీ సీఎం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయ శాంతి, పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. బీజేపీ జాతీయ నాయకులు నేరుగా వీరితో చర్చించినట్టుగా ప్రచారంలో ఉంది. 

టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ సీఎం బీజేపీతో టచ్ లో ఉన్నట్టుగా కాషాయవర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను బీజేపీలో చేరాలని ఆ పార్టీ ఆహ్వానించింది.పెద్దపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కూడ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారంలో ఉంది. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిశారు. ఆయన బీజేపీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారు.

ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. టీడీపీ నేతలతో ఎంపీ గరికపాటి మోహన్ రావు చర్చలు జరిపినట్టుగా సమాచారం. గరికపాటి మోహన్ రావు  నేతృత్వంలో పలువురు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios