నగరి: రాజకీయాల్లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరగడం, అభిమానులను మెప్పించేలా నటించడమే కాదు నోరూరించే వంటలు చేయడం కూడ ఏపీఐఐసీ ఛైర్మెన్ రోజాకు తెలుసు. తన వంటలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రోజా మెప్పించారు. రోజా దంపతులు కేసీఆర్ కటుంబసభ్యులకు కొసరి కొసరి వడ్డించారు.

రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి కాంచీపురంలోని అత్తి వరద రాజస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు. కేసీఆర్ కు నగరిలో రోజా ఘనంగా స్వాగతం పలికారు.

కేసీఆర్  వెంటే రోజా కూడ కాంచీపురం అత్తి వరద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంచీపురం నుండి తిరుమల చేరుకొని శ్రీవారిని కేసీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకొన్నారు.  ఆ తర్వాత అక్కడి నుండి రోజా ఇంటికి  కేసీఆర్ కుటుంబసభ్యులు చేరుకొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అత్యంత రుచికరంగా వంటలు చేసి వడ్డించింది. రోజా ఇంటి వద్ద కేసీఆర్ కు వైఎస్ఆర్‌సీపీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

కేసీఆర్ కుటుంబసభ్యుల కోసం రోజా ప్రత్యేకంగా వంటలను సిద్దం చేశారు.చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీలతో నాన్‌వెజ్‌ ను మెనూలో చేర్చారు.
ఆకు కూర పప్పు, వేపుళ్లు, సాంబారు, రసం, చట్నీలను వెజ్ మెనూలో ఉంచారు. దీనికి తోడు పాయసం కూడ తయారు చేశారు.

రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడ కేసీఆర్ కుటుంబసభ్యులకు కొసరి కొసరి వడ్డించారు. కేసీఆర్ కుటుంబం కోసం  రోజానే స్వయంగా ఈ వంటలను సిద్దం చేసినట్టుగా సమాచారం.

భోజనం చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రోజాను ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రకాల వంటకాలను రుచికరంగా వండి వడ్డించారు. తన బిడ్డ మంచి ఆహారాన్ని తనకు అందించిందని కేసీఆర్ రోజాను అభినందించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రోజాకు కేసీఆర్ ఆశీర్వాదం

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : జగన్ కు అండగా ఉంటానన్న కేసీఆర్

రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్: ఘన స్వాగతం పలికిన ఫైర్ బ్రాండ్

కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

అప్పట్లో కేసీఆర్ పై రోజా బార్, దర్బార్ వ్యాఖ్యలు: ఇప్పుడు వేచి ఉండి స్వాగతం