నీలి చిత్రాల్లో నటించి తాను పెద్దగా సంపాదించిందేమీ లేదని మియా ఖలీఫా చెబుతోంది. కెరీర్ ఆరంభంలో నీలి చిత్రాల్లో నటించిన మియా ఖలీఫా ప్రస్తుతం స్పోర్ట్స్ కామెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతం గురించి.. నీలి చిత్రాల్లో నటించినప్పటి తన పాత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నీలి చిత్రాల్లో నటించి మిలియన్ల డబ్బు సంపాదించానని అందరూ అనుకుంటున్నారని.. అందులో నిజం లేదని వెల్లడించింది.

ఆ సినిమాలో నటించిన మొత్తం కాలంలో తాను 12 వేల డాలర్లు.. ఇండియన్ రుపీస్ లో 8లక్షల 55 వేలు మాత్రమే సంపాదించానని అంతకుమించి ఒక్క రూపాయి కూడా  సంపాదించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. నీలి చిత్రాల పరిశ్రమ నుండి బయటకి వచ్చిన తరువాత సాధారణ ఉద్యోగం దొరకడానికి చాలా కష్టమైందని.. అవి ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా అనిపిస్తుందని ఎమోషనల్ అయింది.

తన జీవితం గురించి తెలిసి ఉద్యోగం ఇవ్వడానికి ఏ ఒక్క కంపనీ ముందుకు రాలేదని చెప్పింది. 2015లో నీలి చిత్రాలకు దూరమైన మియాకి ఈ ఏడాది ఆరంభంలో రాబర్ట్ శాండ్ బర్గ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది.