Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు: 5ప్లస్ 2భద్రతకు గ్రీన్ సిగ్నల్

చంద్రబాబు భద్రతకు సంబంధిందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని ఆదేశించింది. కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని తెలిపింది.   

ap high Court ruling on security of Chandrababu
Author
Amaravathi, First Published Aug 14, 2019, 4:23 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 97 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చంద్రబాబుకు 5 ప్లస్ టూ భద్రత కల్పించాలని ఆదేశించింది. 

ఇకపోతే ఎన్నికల అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. 

చంద్రబాబు పిటీషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ  జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడుకు ఇకపై 97 మందితో భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.  

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. అలాగే కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధుల నిర్వహణపై తాము చేయమని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తేల్చి చెప్పారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. 

చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చంద్రబాబుకు 5ప్లస్ 2 భద్రత ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఒకవిధంగా చూస్తే హై  కోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగానే వచ్చినట్లైంది.  

చంద్రబాబుకు ప్రస్తుతం 74 మందితో భద్రత కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. గతంలో కంటే చంద్రబాబుకు అదనంగానే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు మాత్రం తనకు భద్రత మరింత పెంచాలని కోరిన నేపథ్యంలో ఆ సంఖ్య 97కు పెంచడం జరిగింది.  

అలాగే ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు కావాలని చంద్రబాబు హైకోర్టులో కోరడం జరిగింది. అయితే ప్రతిపక్ష నేతకు ఎప్పుడూ ఒక సీఎస్ వోను మాత్రమే ఇస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు ఒక సీఎస్ వో ను కేటాయించాలని కోర్టు తెలిపింది. 

మెుత్తానికి హైకోర్టు తీర్పు కాస్త చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కోరినట్లు ఒక సీఎస్ వో మినహా అన్ని చంద్రబాబుకు అనుకూలంగానే రావడం విశేషం. 

 ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు భద్రతపై ఏపీ హైకోర్టులో వాదనలు, తీర్పు రిజర్వ్

చంద్రబాబు భద్రతపై పిటిషన్: విచారణ బుధవారానికి వాయిదా

చంద్రబాబు భద్రతపై అఫిడవిట్ దాఖలు చేయండి: జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నాం: చంద్రబాబు భద్రతపై డీజీపీ సవాంగ్

Follow Us:
Download App:
  • android
  • ios