హైదరాబాద్: దేశప్రజలకు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరాయి పాలనలో మగ్గిపోతున్న దేశప్రజల స్వాతంత్ర్య ఫలాలు అందించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చఏశారు. 

ఎందరో పోరాటయోధుల త్యాగఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నస్వేచ్ఛకు కారణమని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ త్యాగధనులకు అంజలి ఘటించి... వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. 

త్యాగధనుల అడుగుజాడల్లో నడిస్తేనే వారి పోరాటానికి నిజమైన విలువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తారతమ్యాలు లేకుండా ప్రతి ఒకరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ త్యాగధనుల పోరాట ఫలితమేనని అంతా గుర్తుంచుకోవాలని సూచించారు.  

అవినీతి, అక్రమాల నుంచి సమాజాన్ని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. రాజకీయ జవాబుదారీతనం సిద్ధించినప్పుడే సమరయోధులు అందించిన స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.