టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో సెటిల్ అయిన నటి తాప్సీ తన సినిమాలతో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బిజీగా ఉన్నా సౌత్ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది.

సినిమాలతో పాటు మ్యాగజైన్ కవర్ పేజీ షూట్ లలో పాల్గొనడం, ఇతర హాట్ ఫోటో షూట్లు చేయడంతో సోషల్ మీడియాని హీటేక్కిస్తోంది. తాజాగా ఎలి అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలను ఆగస్ట్ సంచికలో ప్రచురించారు.

ఫోటోషూట్ తో పాటు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది తాప్సీ. ఫోటోషూట్ మారిషస్ లోని ఎల్ ఇంపీరియల్ రిసార్ట్ అండ్ స్పాలో జరిగిందని తెలుస్తోంది. ఈ ఫోటోషూట్ కోసం తాప్సీ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది. ఫుల్ లెంగ్త్ స్కర్ట్ వేసుకొని సిల్క్ జార్జెట్ షర్ట్ ధరించింది. 

క్లీవేజ్ షో, నడుము అందాలను ఆరభోస్తూ ఈ ఫోటోలో ఎంతో హాట్ గా కనిపించింది తాప్సీ. బీచ్ లో వయ్యారంగా నడుస్తూ పోజివ్వడంతో సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఫోటో షూట్ కి సంబంధించి తాప్సీ మరిన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన 'మిషన్ మంగళ్'.. 'సాంద్ కి ఆంఖ్'  విడుదలకు
సిద్ధంగా ఉన్నాయి.