మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. అఫీషియల్ గా చెప్పకపోయినా అక్టోబర్ 2ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ట్రైలర్ ని రెడీ చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ పనుల్లో బిజిగా ఉన్నాడు. 

ఇక నిర్మాత రామ్ చరణ్ రెగ్యులర్ ప్రమోషన్స్ డోస్ పెరగడానికి ట్రైలర్ ను స్టార్ యాక్టర్స్ ద్వారా రిలీజ్ చేయించేందుకు సిద్దమవుతున్నాడు. బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ద్వారా రిలీజ్ చేయించాలని ప్లాన్ చేసుకున్న చరణ్ తమిళ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ ద్వారా రిలీజ్ చేయించేందుకు రెడీ అవుతున్నారు. 

కోలీవుడ్ లో సైరా సినిమా భారీగా రిలీజ్ కానుంది. సినిమా స్థాయి పెరగాలంటే తప్పనిసరిగా రజిని లాంటి స్టార్ హీరో ప్రమోట్ చేయడం అవసరం. మెగాస్టార్ రజిని సినిమాలకు తెలుగులో విడుదలైనప్పుడు చాలా సార్లు ప్రచారాల్లో సహాయం చేశారు. దీంతో మెగాస్టార్ సినిమాకు రజిని తన సహాయం తప్పనిసరిగా చేస్తాడని చెప్పవచ్చు. వచ్చే నెల చెన్నైలో సైరా ఈవెంట్ ను నిర్వహించి అందులో తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు.