అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ ఉపసంఘంతో భేటీ అయిన సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో వెనకడుగు వేయోద్దని హితవు పలికారు. 

తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చిన సీఎం జగన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ఆదేశించారు. 

రివర్స్ టెండరింగ్ అంశంలో మిగిలే ప్రతీ పైసా ప్రజలకే చెందుతుందని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలన అందిస్తానని మంత్రులకు తెలియజేశారు. అందుకు అందరూ సహకరించాలని జగన్ కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు