గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తీసుకున్న అప్పు చెల్లించాలని ఓ లారీ డ్రైవర్‌కు వేధింపులు రావడంతో నాగేంద్రబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఇటికేపల్లికి చెందిన నాగేంద్రబాబు ఎన్ఆర్ఎస్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో తన యజమాని దగ్గర రూ.65 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజుల నుంచి బాకీ తీర్చాలని యజమాని వద్ద నుంచి వేధింపులు ఎక్కువకావడంతో వాటిని భరించలేకపోయాడు.

ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జగన్ వస్తే వేధింపులు తగ్గుతాయని అనుకున్నానని.. డ్రైవర్‌ల జీవితాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని సదరు పోస్ట్‌లో నాగేంద్రబాబు విజ్ఞప్తి చేశాడు.