బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న యాంకర్ శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మొదటి వారం నుండి ఆమె నామినేషన్స్ లో ఉంటున్నప్పటికీ ఫ్యాన్స్ వేస్తోన్న ఓట్లతో బాగానే సేవ్ అయిపోతుంది. అయితే హౌస్ లో మిగిలిన వారితో పోలిస్తే తనకు మాత్రమే ప్రత్యేకమైన హోదా ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. తనను ఫైనల్స్ కి తీసుకెళ్లే బాధ్యత 
బిగ్ బాస్ తీసుకుంటున్నట్లుగా ఎంత కోపం వచ్చినా.. కంట్రోల్ చేసుకొని గొడవల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది.

అయితే ఫిజికల్ టాస్క్ లలో మాత్రం తనను ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదంటూ కండీషన్స్ పెడుతోంది. ఇంతకముందు కూడా దొంగల టాస్క్ లో ఎవరైనా తనను ముట్టుకుంటే నచ్చదని స్టేట్మెంట్ ఇచ్చింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో కూడా శ్రీముఖి ఇలానే ప్రవర్తించింది. తనను టచ్ చేయకూడదని రాహుల్ తో చెప్పింది.

మిగిలిన ఫిమేల్ కంటెస్టంట్స్గేమ్ ని గేమ్ లాగా తీసుకొని స్పోర్టివ్ గా ఆడుతుంటే శ్రీముఖి మాత్రం తనను ఎవరూ ముట్టుకోకూడదని విమెన్ కార్డ్ ప్లే చేస్తుంది. దీంతో సోషల్  మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లు మగాళ్లకు, ఆడవాళ్లకు కలిపే పెడతారనే విషయం శ్రీముఖికి తెలియదా..? ఎవరూ టచ్ చేయకూడదని రూల్స్ పెట్టుకున్న ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

మరికొందరు బుల్లితెరపై ఆమె యాంకర్ రవితో చేసిన రొమాన్స్ ని చిన్న చిన్న వీడియోల మాదిరి కట్ చేసి పోస్ట్ చేస్తూ రవి ముట్టుకుంటే ఓకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.