యూరప్ ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరంగా పేరున్న ఎల్ బ్రూస్ అధిరోహించిన ప్రఖ్యాత పర్వతారోహకురాలు ఆశా దళవాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. గత ఏడాది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన కిలిమంజారో అధిరోహించిన ఆశా.. ఇప్పుడు నల్ల సముద్రం, కాస్పియస్ సముద్రానికి మధ్య ఉన్న ఎల్ బ్రూస్ పర్వతాన్ని తన బృందం సహాయంతో అధిరోహించడం ఆనందంగా ఉందని అన్నారు. 

ప్రతి విజయానికీ ప్రతీకగా పర్వత శిఖరంపై త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరిస్తూ దేశభక్తిని చాటుకోవడంతో పాటు జనసేన పతాకాన్ని ఆవిష్కరించడం అభినందనీయలమన్నారు. ఏడు ఖండాల్లో ఉన్న ఏడు అత్యంత ఎత్తయిన పర్వాతాలను అధిరోహించాలన్న ఆమె కల త్వరలోనే నెరవేరాలని ఆకాక్షింస్తూ.. హృదయ పూరర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పవన్ చెప్పారు.