MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే

Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే

Bank holidays August : ఆగస్టు నెలలో బ్యాంకులు సగం రోజులు మూతపడనున్నాయి. పండుగలు, వారాంతాలు కలిపి బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల వారీగా బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 31 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆగస్టులో బ్యాంకులకు సగం రోజులు సెలవులు
Image Credit : Chatgpt

ఆగస్టులో బ్యాంకులకు సగం రోజులు సెలవులు

ప్రతీనెలా మన రోజువారీ ఖర్చులు, వ్యాపార లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులన్నీ బ్యాంకులతోనే ముడిపడి ఉంటాయి. అందుకే ప్లాన్ సరిగ్గా లేకపోతే బ్యాంక్ గేటు వద్ద లాక్ చూసి వెనక్కి రావాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం, రాబోయే ఆగస్టు 2026 నెలలో వివిధ ప్రాంతీయ పండుగలు, జాతీయ దినోత్సవాలు, వారాంతపు సెలవులు కలిపి మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

మరి ఈ సెలవుల్లో మన తెలుగు రాష్ట్రాలకు వర్తించే తేదీలు ఏవి? ఆన్ లైన్ సేవల పరిస్థితి ఏంటి? అనే విషయాలను క్లియర్ ఇక్కడ గా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దేశవ్యాప్తంగా, ప్రాంతీయ పండుగలతో బ్యాంకులకు సెలవులు
Image Credit : Gemini

దేశవ్యాప్తంగా, ప్రాంతీయ పండుగలతో బ్యాంకులకు సెలవులు

ఆగస్టు నెలలో పండుగల సందడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇచ్చే సెలవులతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతీయ పండుగలకు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.

• ఆగస్టు 4: త్రిపురలో 'కెర్ పూజ' సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

• ఆగస్టు 8: సిక్కింలో 'టెండోంగ్ లో రుమ్ ఫాట్' జరుపుకుంటారు.

• ఆగస్టు 13: మణిపూర్ లో 'పేట్రియాట్స్ డే' వేడుకల వల్ల బంద్.

• ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి.

• ఆగస్టు 16: డామన్-డయ్యూ, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో 'పార్సీ నూతన సంవత్సరం' సెలవు.

• ఆగస్టు 19: త్రిపురలో 'మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి' సెలవు.

• ఆగస్టు 25: మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

• ఆగస్టు 26: ఈద్-ఎ-మిలాద్ / తిరువోణం సందర్భంగా తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సెలవు.

• ఆగస్టు 27: ఒడిశాలో 'ఝూలన్ యాత్ర' సందర్భంగా బ్రాంచీలు క్లోజ్.

• ఆగస్టు 28: రక్షా బంధన్, శ్రీ నారాయణ గురు జయంతి వంటి సందర్భాల్లో గుజరాత్, రాజస్థాన్, యూపీ, ఎంపీ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే.

Related Articles

Related image1
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
Related image2
Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?
36
బ్యాంకుల శని, ఆదివారాల వారాంతపు సెలవుల లిస్ట్
Image Credit : ChatGPT

బ్యాంకుల శని, ఆదివారాల వారాంతపు సెలవుల లిస్ట్

పండుగల సెలవులతో పాటు ప్రతి నెలా సాధారణంగా వచ్చే ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల సెలవులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

• ఆగస్టు 2: మొదటి ఆదివారం

• ఆగస్టు 8: రెండవ శనివారం

• ఆగస్టు 9: రెండవ ఆదివారం

• ఆగస్టు 16: మూడవ ఆదివారం

• ఆగస్టు 22: నాలుగవ శనివారం

• ఆగస్టు 23: నాలుగవ ఆదివారం

• ఆగస్టు 30: ఐదవ ఆదివారం

46
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్?
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అన్ని సెలవులు వర్తించవు. మన దగ్గర బ్యాంకులకు ఎప్పుడు సెలవులు అంటే..

• ఆగస్టు 15 (శనివారం): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోను నేషనల్ హాలిడే.

• ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

• ఆగస్టు 26 (బుధవారం): ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా తెలంగాణతో పాటు ఇతర ప్రధాన రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ అవుతాయి.

దీనికి అదనంగా ఆగస్టు 2, 8, 9, 16, 22, 23, 30 తేదీల్లో ఆదివారాలు, 2వ, 4వ శనివారాల సాధారణ సెలవులు వర్తిస్తాయి.

56
బ్రాంచీలు మూతపడినా డిజిటల్ సేవలు ఫుల్ ఆన్
Image Credit : getty

బ్రాంచీలు మూతపడినా డిజిటల్ సేవలు ఫుల్ ఆన్

బ్యాంకు శాఖలు పనిచేయకపోయినా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మీరు ఇంటి నుంచే మీ లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

• నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు 24x7 రన్ అవుతాయి.

• గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.

• డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.

• ఐఎంపీఎస్, నెఫ్ట్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్లు చేసుకోవచ్చు.

66
వినియోగదారులు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఇవే
Image Credit : ChatGPT

వినియోగదారులు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఇవే

ఆన్‌లైన్ సేవలు ఉన్నప్పటికీ.. క్యాష్ డిపాజిట్లు, పెద్ద మొత్తంలో చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్‌లు తీయడం లేదా కొత్త ఖాతాలు తెరవడం వంటి పనులకు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిందే. కాబట్టి మీ ఊరిలో లేదా ప్రాంతంలో బ్యాంకు పని ఉంటే, పైన పేర్కొన్న సెలవుల క్యాలెండర్‌ను ఒకసారి చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Related Stories
Recommended image1
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
Recommended image2
Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved