తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన చాలా బాగుందని కొనియాడారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్ఆర్ పేరు నిలిపేలా ప్రస్తుత సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కొనియాడారు. 

జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలంతా హర్షిస్తున్నట్లు తెలిపారు. మోదీ, అమిత్‌ షా నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. 

మోదీ కృషి వల్ల అమెరికా, చైనా తర్వాత భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా మోదీ వైపు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారని ప్రశంసించారు. 

మరోవైపు పార్టీ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కూడా వ్యూహాత్మకంగా స్పందించారు. పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతేగానీ పార్టీలో ఉంటానని మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. 

ఈ వార్తలు కూడా చదవండి

హలో బ్రదర్స్: కాంగ్రెస్ అధిష్టానంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆటలు

కోమటిరెడ్డి రాజగోపాల్ పై విహెచ్ పరోక్ష దండయాత్ర

కోమటిరెడ్డిని ఎందుకు చేర్చుకోలేదు, బీజేపీకి టులెట్ బోర్డు తప్పదు: పొన్నం ప్రభాకర్

కోమటిరెడ్డిని ఎన్నిసార్లు వదిలేస్తారు, ఇదేమైనా నల్గొండ కాంగ్రెస్సా..?: వీహెచ్ ఫైర్