నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జై సింహా తర్వాత బాలయ్య, సి కళ్యాణ్, రవికుమార్ కలయికలో వస్తున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత బాలయ్య కమర్షియల్ చిత్రానికి ఓకే చెప్పారు. బోయపాటిని పక్కన పెట్టి మరీ బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు. 

ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగులో సోనాల్ చౌహన్ క్రేజ్ అంతంత మాత్రమే. ఇక వేదిక ఇటీవల కాంచన 3 చిత్రంతో విజయాన్ని అందుకుంది. 

ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ అందాలు ఆరబోయనుందట. బ్యాంకాక్ బీచ్, ఇతర అందమైన లొకేషన్స్ లో సోనాల్ చౌహన్ పరిచయ సన్నివేశాలని చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సోనాల్ బికినిలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సోనాల్ చౌహన్ ఏకంగా 45 లక్షల పారితోషికం అందుకుంటోందట. సాధారణంగా సోనాల్ చౌహన్ రేంజ్ హీరోయిన్లు 20 లక్షలకు కూడా సినిమాలు ఓకే చేస్తారు. బికినీ సన్నివేశాల్లో నటించాల్సి ఉండడంతో సోనాల్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.