MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే

LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే

LPG New Rules From August 1: ఆగస్టు నుంచి ఎల్‌పీజీ గ్యాస్ నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. సబ్సిడీ కట్, స్విగ్గీ డెలివరీ, ధరల్లో మార్పులు.. ఇలా కొత్తగా రాబోతున్న అప్డేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 31 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్.. ఈ 6 విషయాలు తెలియకపోతే ఇబ్బందే
Image Credit : Asianet News

గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్.. ఈ 6 విషయాలు తెలియకపోతే ఇబ్బందే

ప్రతి నెల ప్రారంభంలో చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్యాస్ వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను, ధరల సవరణలను ప్రకటించడం సహజమే. అయితే, ఈసారి ఆగస్టు నుంచి రాబోతున్న మార్పులు సామాన్యుల రోజువారీ జీవితంపై, ముఖ్యంగా గృహిణులు, చిన్న వ్యాపారస్తులు, విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి. వంటింటి గ్యాస్ (LPG) వినియోగం నుంచి మొదలుకొని పైప్‌లైన్ గ్యాస్ (PNG) వరకు ఏకంగా 6 ప్రధాన మార్పులు జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నిమిషాల్లో గ్యాస్ కనెక్షన్.. స్విగ్గీ ద్వారా డెలివరీ
Image Credit : Gemini AI

నిమిషాల్లో గ్యాస్ కనెక్షన్.. స్విగ్గీ ద్వారా డెలివరీ

ఇప్పటివరకు కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏజెన్సీల చుట్టూ తిరగడం, రోజుల తరబడి వెయిట్ చేయడం సర్వసాధారణం. కానీ, భారత్ పెట్రోలియం (BPCL) 'భారత్ లైట్ జిప్' అనే సరికొత్త సర్వీస్‌తో ముందుకు వచ్చింది. దీనివల్ల అసలు ఆలస్యం లేకుండా తక్షణమే కొత్త కనెక్షన్ పొందవచ్చు. స్పీడ్‌గా డెలివరీ కూడా అందుతుంది. ప్రస్తుతం ముంబైలో నడుస్తున్న ఈ సేవలను ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లోని 100 నగరాలకు విస్తరించనున్నారు.

మరోవైపు, హెచ్‌పీసీఎల్ (HPCL) సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) తో చేతులు కలిపింది. దీని ద్వారా కిరాణా సరుకులు ఆర్డర్ చేసినట్లే క్షణాల్లో గ్యాస్ సిలిండర్‌ను ఇంటికి తెప్పించుకోవచ్చు. బ్యాచిలర్స్, చిన్న కుటుంబాలు, స్టూడెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని 10 కేజీల 'హెచ్‌పీ నవ్య' కాంపాక్ట్ సిలిండర్లు, 5 కేజీల మినీ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతానికి ఈ సర్వీస్ బెంగళూరులో స్టార్ట్ అయ్యింది. మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు.

Related Articles

Related image1
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Related image2
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
36
ఉజ్వల యోజన లబ్ధిదారులకు బిగ్ షాక్
Image Credit : Getty

ఉజ్వల యోజన లబ్ధిదారులకు బిగ్ షాక్

పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' (PMUY) సబ్సిడీ నిబంధనల్లో ప్రభుత్వం కీలక కోత విధించింది. ప్రభుత్వానికి సబ్సిడీ భారం ఎక్కువవుతుండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఉజ్వల స్కీమ్ కింద సంవత్సరానికి 9 సిలిండర్ల వరకు సబ్సిడీ అందేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఏడాదికి కేవలం 4 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది. పరిమితి దాటితే సాధారణ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

46
గ్యాస్ ధరలలో మార్పులు
Image Credit : AI

గ్యాస్ ధరలలో మార్పులు

జులై లో గ్యాస్ ధరలకు సంబంధించి సామాన్యులకు కొంత ఊరట లభించిందనే చెప్పాలి. ఇళ్లలో వాడే 14.2 కేజీల సాధారణ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం పెంచకుండా యథాతథంగా పాత ధరలనే కొనసాగించింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపే వ్యాపారస్తులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వచ్చిన 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఈసారి భారీగా తగ్గించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు రూ. 170 నుండి రూ. 182 వరకు కోత విధించారు. దీంతో చిన్న చిన్న వ్యాపారులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. ఆగస్టు లో మళ్లీ ధరలు మారనున్నాయి.

56
పీఎన్‌జీ కనెక్షన్ తీసుకుంటే పాత సిలిండర్ రూల్స్
Image Credit : Getty

పీఎన్‌జీ కనెక్షన్ తీసుకుంటే పాత సిలిండర్ రూల్స్

మీరు ప్రస్తుతం ఇంట్లో పైప్‌లైన్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకుని ఉన్నారా? అయితే మీకో ముఖ్యమైన హెచ్చరిక. పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోగా మీ పాత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌ను (ఇండేన్, భారత్ లేదా హెచ్‌పీ ఏదైనా) తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి లేదంటే సరెండర్ చేయాలి.

ఒకవేళ భవిష్యత్తులో మీరు పీఎన్‌జీ సౌకర్యం లేని వేరే ప్రాంతానికి మారాల్సి వస్తే, మళ్లీ పాత ఎల్పీజీ కనెక్షన్‌ను సులువుగా రీయాక్టివేట్ చేసుకోవడానికి 'ట్రాన్స్ఫర్ వోచర్' తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

66
డిజిటల్ బుకింగ్, ఓటీపీ డెలివరీ, లాక్ ఇన్ పీరియడ్ వివరాలు
Image Credit : Getty

డిజిటల్ బుకింగ్, ఓటీపీ డెలివరీ, లాక్ ఇన్ పీరియడ్ వివరాలు

సిలిండర్ బుకింగ్, డెలివరీ విషయంలో పారదర్శకత పెంచేందుకు చమురు సంస్థలు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.

• డిజిటల్ బుకింగ్ మాత్రమే: ఇకపై గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. పూర్తి ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతిలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

• ఓటీపీ తప్పనిసరి: డెలివరీ బాయ్ మీ ఇంటికి సిలిండర్ తెచ్చినప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన సెక్యూరిటీ కోడ్ చెప్తేనే డెలివరీ ఇస్తారు. ఓటీపీ చెప్పకపోతే డెలివరీని వెనక్కి తీసుకెళ్తారు.

• లాక్ ఇన్ పీరియడ్: ఒక సిలిండర్ తీసుకున్న వెంటనే మరో సిలిండర్ బుక్ చేయడానికి వీల్లేదు. పట్టణాల్లో నివసించే వారు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు 45 రోజుల గ్యాప్ పాటించాల్సిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
Recommended image2
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ తేదీ నుంచే భారీగా పెరగనున్న జీతాలు !
Related Stories
Recommended image1
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved