వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఊహించని విధంగా మరొకసారి వరుసగా అపజయాలను ఎదుర్కొంటోంది.ధృవ తరువాత అంతా సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో బేబీకి వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ నిండా ముంచేశాయి. 

స్పైడర్ సినిమా నుంచి బ్యాడ్ టైమ్ ఓ రేంజ్ లో రన్నవుతోంది. రీసెంట్ గా వచ్చిన మన్మథుడు 2 అయినా కెరీర్ కు మంచి బూస్ట్ ఇస్తుందనుకుంటే ఈ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. నాగార్జున నటించిన మన్మథుడు 2కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ముందు ఈ సినిమాకు చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ లక్కులో రకుల్ కి అవకాశం దక్కింది. 

కానీ సినిమా మాత్రం బేబీకి సక్సెస్ ఇవ్వకపోవడమే కాకుండా నెగిటివ్ కామెంట్స్ ను కూడా అందించింది. సిగరెట్ తాగడం నుంచి అలాగే ఝాన్సీ ని ముద్దు పెట్టుకోవడం వరకు అన్ని సీన్స్ నెగిటివ్ ప్రచారాలతో షాక్ ఇచ్చాయి.

ఈ విషయం అమ్మడికి తెలిసినప్పటికీ షికారెట్ తాగితే తప్పేంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిందే గాని తన పాత్ర జనాలకు ఎంతవరకు నచ్చుతుందనే విషయాన్నీ మాత్రం పట్టించుకోలేదు. మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న మన్మథుడు 2 బేబీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.