రాయుడి ఖేల్ ఖతమ్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 3, 2019, 6:37 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

తీవ్ర అసంతృప్తి: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై

ప్రపంచ కప్ కు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కకకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంబటి రాయుడు బుధవారంనాడు తన రిటైర్మమెంట్ విషయాన్ని ప్రకటించాడు.
 

 

గ్రౌండ్‌లో కళ్లన్నీ ఆమెపైనే..కోహ్లీ సైతం కాళ్లు మొక్కాడు, ఎవరామె

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని టార్గెట్ చేశాయి. ఆమె సెలబ్రిటీ కాదు.. అయినా తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ చేస్తుంటే ఆమె బూర ఊదుతూ.. కేరింతలు కొడుతూ సందడి చేశారు.

 

మొన్న జిడ్డు అన్నాడు: ధోనీపై మాట మార్చిన టెండూల్కర్

ధోనీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కూడా కురిపించాడు. ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ జిడ్డు బ్యాటింగ్‌ చేయడంతో తాను తీవ్ర నిరాశ చెందానని ఇటీవల అన్నాడు. అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ ధోనీకి అండగా నిలిచాడు. 
 

 

అంబటి రాయుడికి మొండి చేయి: తెర వెనక కోహ్లీ, రవిశాస్త్రి

విజయ శంకర్ స్థానంలో టీమిండియా జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడం వెనక కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఉన్నట్లు తెలుస్తోంది. విజయ శంకర్ స్థానంలో తమకు మాయాంక్ అగర్వాల్ కావాలని వారు పట్టుబట్టినట్లు సమాచారం. అందుకే అంబటి రాయుడిని కాకుండా మాయాంక్ అగర్వాల్ ను బిసిసిఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 

 

టీమిండియాకు మరో బిగ్ షాక్...ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ఫిక్స్

టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్మెంట్ కు సిద్దమయ్యాడు. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా ఆడే మ్యాచే అతడికి చివరి మ్యాచ్ కానుంది. ఈ మేరకు ధోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

 

నాకు రెస్ట్ వద్దు.. నేను ఆడతాను..బుమ్రా

తనకు ఎలాంటి రెస్ట్ అవసరం లేదని.. తాను అన్ని మ్యాచ్ లు ఆడాలని అనుకుంటున్నట్లు టీం ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం టీం ఇండియా  బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. అయితే... ఈ మ్యాచ్ నాలుగు వికెట్లు సునాయాసంగా తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
 

 

వరల్డకప్ హోరు చాలా హుషారుగా సాగుతోంది. ఇప్పటికే టీం ఇండియా సెమిస్ లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మంగళవారం బంగ్లాదేశ్ తో టీం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో... ఆటగాళ్లకన్నా కూడా ఓ 87ఏళ్ల బామ్మ ఫేమస్ అయిపోయింది. 
 

 

అంబటి రాయుడికి ఐస్ లాండ్ బంపర్ ఆఫర్

ప్రపంచ కప్ పోటీలకు టీమిండియా బ్యాకప్‌ ప్లేయర్‌గా అంబటి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశా రు. దానివల్ల విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా వెనుదిరగడంతో రాయుడికి అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపు అందింది. 
 

 

రోహిత్ కొట్టిన సిక్సర్... ఆమెకు తగిలింది..!

టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. తన బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేస్తూనే... తన మంచి మనుసుతో అభిమానుల మనసులను రోహిత్ గెలుచుకుంటున్నాడు.
 

 

కాంగ్రెస్ నా ఊపిరి, చచ్చే వరకు పార్టీలోనే ఉంటా: రఘువీరారెడ్డి

ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తెలిపారు. ఇకపోతే దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమంటూ చెప్పుకొచ్చారు. 
 

 

జగన్ గారు బొత్సని అడగాల్సింది... లోకేష్ సెటైర్లు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఆరోపించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్... సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
 

 

ఆప్తుడికి కేబినెట్ పదవి కట్టబెట్టనున్న సీఎం వైయస్ జగన్

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో కాస్త ముభావంగా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైయస్ జగన్ పావులు కదుపుతున్నారు. 
 

నా గెస్ట్‌హౌస్ కూడ కూల్చేయండి...కానీ: గోకరాజు గంగరాజు

కృష్ణా నది కరకట్టపై ఉన్న అందరి నిర్మాణాలను కూల్చేస్తే తన గెస్ట్‌హౌస్‌ను కూడ కూల్చివేయాలని  మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు.

 

అది మంచిది కాదు, జగన్ కు ఎవరైనా మంచి సలహాలు ఇవ్వండి: కాంగ్రెస్ నేత వీహెచ్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ కూల్చివేత నిర్ణయం సరికాదని సూచించారు. రాజీవ్ గాంధీ చేయబట్టే వైయస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని గుర్తు చేశారు. 
 

 

బాబును చూడగానే ఉద్వేగం: పార్టీ ఓడిపోయిందంటూ విలపించిన మహిళలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం బాబును కలిసేందుకు పలువురు మహిళా కార్యకర్తలు వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబును చూడగానే వారు భావోద్వేగానికి గురయ్యారు.
 

 

అందుకే నేను మంగళగిరిలో ఓడిపోయా: నారా లోకేష్

రోడ్లు, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఎనలేని అభివృద్ధి చేసిన చోట కూడా ఓటమి పాలయ్యామని లోకేష్ అన్నారు. అయితే ఓడిపోయినా కూడా ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో పార్టీలోని ప్రతి కార్యకర్తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 

 

బాబు అసెంబ్లీకి తప్పుడు పత్రాలు కూడ తెచ్చారు: జగన్

చంద్రబాబునాయుడుకు అసెంబ్లీ వేదికగానే అబద్దాలు చెప్పే అలవాటు ఉందని... చంద్రబాబు మాదిరిగా అసెంబ్లీ అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
 

 

ఏపీలో కాంగ్రెస్‌కు షాక్: పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా

ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయగా.. వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. 
 

 

జనసేనలో నాగబాబుకు కీలక పదవి, ఫైనల్ చేసిన పవన్

ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి వరుసగా సమీక్షలు చేయడంతో పాటు పలు కమిటీలను నియమిస్తూ వస్తున్నారు పవన్
 

 

బంగారం పట్టివేత: వెలుగు చూసిన విస్తుపోయే విషయాలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుకొన్న కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది.  స్మగ్లర్లు బలవంతంగా తమ వెంట బంగారాన్ని పంపారని యాత్రికులు తెలిపారు. బంగారాన్ని తీసుకెళ్లకపోతే తప్పుడు కేసులు పెడతామని తమను బెదిరించారని బాధితులు పోలీసుల విచారణలో చెప్పారు.
 

 

అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్

ఎప్ఆర్‌ఓ అనిత పై దాడికి ముందు భూమిని చదును చేసేందుకు వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్లను కోనేరు కృష్ణ దాడికి దిగినట్టుగా  కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్‌గా మారాయి
 

 

అమెరికాకు పారిపోతుండగా శివాజీ పట్టివేత: పాస్ పోర్టు సీజ్

టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అరెస్ట్ చేసి.. సైబరాబాద్ పీఎస్‌కు తరలించారు. 
 

 

ప్రజల కోసం: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తన నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆమె ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించారు.
 

 

టీవీ9 వాటాల కేసు: పోలీసుల అదుపులో హీరో శివాజీ

టీవీ9 వాటాల వివాదంలో సినీనటుడు శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో  సీసీఎస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. 
 

 

'రాయుడు.. తప్పు నీది కాదు' .. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు తేజం అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్, ఐపీఎల్ ఇలా అన్ని ఫార్మాట్లకు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో చోటు దక్కుతుందని రాయుడు ఎన్నో ఆశలతో ఉన్నాడు. కానీ సెలెక్టర్లు రాయుడికి మొండి చెయ్యి చూపించారు. ఇక కెరీర్ పై ఆశలు వదులుకున్న రాయుడు తాజాగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు
 

 

ప్రముఖ నటి భర్త అరెస్ట్..!

అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను అంబోలీ పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

 

 

'సై రా..' అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా 'సై రా నరసింహారెడ్డి'. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఇది బయోపిక్ కావడంతో అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకూడదు.
 

 

'ఓ బేబీ': సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

అక్కినేని సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఓ బేబీ'. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం సమంత అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం.
 

 

RRR: రాజమౌళి లెక్క తప్పదు కదా.. ఇలాగైతే కష్టమే!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. సౌత్ లో ఇటీవల ఎన్నడూలేని విధంగా ఇద్దరి సమకాలీన స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి చిత్రం రూపొందిస్తాడో అని ప్రేక్షకుల ఎదురుచూస్తుండగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రకటించారు. డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

 

అనుష్క సైలెన్స్ లుక్: ఎందుకింత సస్పెన్స్ ?

నుష్క సైలెన్స్ సినిమాతో ఎలాంటి థ్రిల్ ఇస్తుందో గాని సినిమా హడావుడి కూడా సైలెంట్ గానే ఉంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ అనుష్క లుక్ ని చూపించడానికి చాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భాగమతిగా బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు మార్చిన అనుష్క సైలెన్స్ సినిమాను సైలెంట్ గా ఫినిష్ చేస్తోంది. 
 

 

కైరా అద్వానీతో లవ్వా?.. హీరో షాకింగ్ రియాక్షన్

బాలీవుడ్ లో ఇటీవల ఒక రూమర్ డోస్ మరి ఎక్కువైంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కైరా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు టాక్ వచ్చింది. అది కూడా యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా అని చెప్పగానే దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది. 
 

 

'బిగ్ బాస్ 3' సెట్ లో పోలీసులు.. ఆమె అరెస్ట్ కి రంగం సిద్ధం!

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కి అతడి కూతురు వనితతో ఆస్థి తగాదాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తన ఇంటిని కూతురు బలవంతంగా లాక్కుందని వనితపై కేసు పెట్టారు. ఈ వివాదం మరింత ముదిరింది.
 

 

పెళ్లి కాలేదు.. కానీ మూడేళ్ల కూతురుంది.. హీరోయిన్ సంచలన కామెంట్స్!

పదేళ్ల క్రితం వచ్చిన 'దేవ్ డీ' అనే సూపర్ హిట్ సినిమాలో నటించింది నటి మహీ గిల్. ఆ సినిమాతో మంచు గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల గురించి ఇప్పటివరకు నోరు మెదపలేదు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
 

 

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ గత ఏడాది కాలంగా వెండి తెరకు కనిపించడం లేదు. అయితే పెద్ద స్క్రీన్ పై మిస్సయినా అమ్మడు రూమర్స్ అండ్ కాంట్రవర్సీ లతో ఆడియెన్స్ దృష్టిలో పడుతూనే ఉంది. బాయ్ ఫ్రెండ్ మైకేల్‌ కోర్సేల్‌ తో బ్రేకప్ విషయం సౌత్ లో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.

 

click me!