అక్కినేని సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఓ బేబీ'. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం సమంత అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం.

సినిమా సైన్ చేసిన సమయంలో కొంత డబ్బుని అడ్వాన్స్ గా తీసుకున్న సమంత సినిమా థియేట్రికల్ బిజినెస్ ద్వారా వచ్చిన షేర్ లో వాటా తీసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకుందట. ఆ లెక్కన చూసుకుంటే ఈ బ్యూటీకి రూ.2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళనాడు, కర్నాటక, ఓవర్సీస్ లలో సినిమాకు మంచి మార్కెట్ జరిగింది. ఆయా ప్రాంతాల్లో సినిమా భారీ లాభాలను తీసుకొస్తుందని చిత్రబృందం భావిస్తోంది. సమంత రెమ్యునరేషన్ పక్కన పెడితే.. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ రూ.6 కోట్ల వరకుఅయిందని తెలుస్తోంది.

ఈ సినిమా కొరియన్ 'మిస్ గ్రానీ'కి రీమేక్ కాబట్టి రాయల్టీ కోసం పదికోట్లు చెల్లించారు. ఆ విధంగా చూసుకుంటే.. సమంత రెమ్యునరేషన్ తో కలిపి మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ రూ.18 కోట్లన్నమాట. మరి సినిమా విడుదలైన తరువాత ఆ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి!