టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం సుమారు 3 గంటల పాటు అలంద మీడియా, టీవీ9 వాటాల కొనుగోలు తదితర అంశాలపై పోలీసులు శివాజీని విచారించారు.

దేశం విడిచి వెళ్లకుండా శివాజీ పాస్‌పోర్టును హైదరాబాదు సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. అమెరికా పారిపోవడానికి  ప్రయత్నించిన శివాజీని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా చెప్పి ఇంటికి పంపించివేశారు.