ఎప్ఆర్‌ఓ అనిత పై దాడికి ముందు భూమిని చదును చేసేందుకు వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్లను కోనేరు కృష్ణ దాడికి దిగినట్టుగా  కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్‌గా మారాయి.

కాగజ్‌నగర్: ఎప్ఆర్‌ఓ అనిత పై దాడికి ముందు భూమిని చదును చేసేందుకు వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్లను కోనేరు కృష్ణ దాడికి దిగినట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్‌గా మారాయి.

సార్సా గ్రామం నుండి సంఘటన జరిగిన ప్రదేశం సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గ్రామం నుండి సంఘటన స్థలానికి వెళ్లే సమయంలో కర్రలతో అడ్డు వచ్చినవారిపై దాడికి దిగారు. ఈ భూమిలో చదును చేసేందుకు ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు తీసుకొచ్చారు. అయితే ఈ ట్రాక్టర్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవని కోనేరు కృష్ణ ఆరోపించారు.

ఈ ట్రాక్టర్ డ్రైవర్లపై కోనేరు కృష్ణ దాడికి దిగినట్టుగా ఈ వీడియోల్లో ఉన్నాయి. అయితే కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు దాడికి దిగుతున్న సమయంలో కూడ పోలీసులు అక్కడే ఉన్నారు. కానీ, పోలీసులు కూడ కనీసం వారించలేదు. 

అంతేకాదు కోనేరు కృష్ణ దాడులు చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్లలో వీడియోలు తీసిన విషయాన్ని గుర్తించి సుమారు 15 సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. ధ్వంసమైన సెల్‌ఫోన్ల నుండి ఈ వీడియోలను తీసేందుకు పోలీసులు నిపుణులను సంప్రదిస్తున్నారు.

సంఘటన స్థలానికి వెళ్లే సమయంలో ఫారెస్ట్ అధికారులపై కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు దూషించారని.. ఈ వీడియోల్లో నిక్షిప్తమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఘటనలో ఇప్పటికే 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)