కృష్ణా నది కరకట్టపై ఉన్న అందరి నిర్మాణాలను కూల్చేస్తే తన గెస్ట్‌హౌస్‌ను కూడ కూల్చివేయాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు.
అమరావతి: కృష్ణా నది కరకట్టపై ఉన్న అందరి నిర్మాణాలను కూల్చేస్తే తన గెస్ట్‌హౌస్‌ను కూడ కూల్చివేయాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు.
బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. హుడా, ఇరిగేషన్ అధికారుల అనుమతులు తీసుకొన్న తర్వాతే నిర్మించినట్టుగా ఆయన చెప్పారు. కరకట్టపై ఉన్న తమ నిర్మాణాలు అక్రమమని తేలితే... అందరి భవనాలను కూలిస్తే తన భవనాలను కూడ కూల్చివేయాలని ఆయన కోరారు.
తాను కృష్ణా నదికి ఒడ్డున సుమారు 16 ఎకరాలను పలు సంస్థలకు కూడ ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కోసం కూడ తాను కొంత స్థలాన్ని కూడ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కృష్ణ నది ఒడ్డున నిర్మాణాలకు సంబంధించి తనకు రెండు నోటీసులు జారీ అయినట్టుగా ఆయన చెప్పారు.ఈ నోటీసులకు తాను సమాధానం ఇవ్వనున్నట్టుగా ఆయన చెప్పారు. పదిమందికి సహాయపడేందుకు తాను పనిచేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.ఈ భవనాల నిర్మాణాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
