అనుష్క సైలెన్స్ సినిమాతో ఎలాంటి థ్రిల్ ఇస్తుందో గాని సినిమా హడావుడి కూడా సైలెంట్ గానే ఉంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ అనుష్క లుక్ ని చూపించడానికి చాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భాగమతిగా బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు మార్చిన అనుష్క సైలెన్స్ సినిమాను సైలెంట్ గా ఫినిష్ చేస్తోంది. 

మొత్తానికి సినిమాకు సంబందించిన ఒక పిక్ ని రిలీజ్ చేసినప్పటికీ అనుష్క అంధకారంలోనే ఉన్నట్లుంది. ఎదో పుస్తకం పట్టుకొని రాస్తున్న ఆమె త్వరలో స్పాట్ లైట్ లోకి వస్తానని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. అందుకు సంబందించిన పిక్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ఆమె లుక్ పై ఎందుకింత సప్సెన్స్ మెయింటైన్ చేస్తున్నారో తెలియదు గాని అనుష్క మళ్ళీ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడం పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి. 

హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో నిశ్శబ్దం అనే పేరుతో తెరకెక్కుతోంది. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మాధవన్ అలాగే హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.