తెలుగు తేజం అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్, ఐపీఎల్ ఇలా అన్ని ఫార్మాట్లకు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో చోటు దక్కుతుందని రాయుడు ఎన్నో ఆశలతో ఉన్నాడు. కానీ సెలెక్టర్లు రాయుడికి మొండి చెయ్యి చూపించారు. ఇక కెరీర్ పై ఆశలు వదులుకున్న రాయుడు తాజాగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. 

అంబటి రాయుడు ప్రతిభకు తగ్గ ఫలితం దక్కలేదని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా హీరో సిద్దార్థ్ రాయుడి రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ క్రికెట్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి రాయుడి సత్తా గురించి తెలుసు. రాయుడు కెరీర్ లో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఎత్తు పల్లాలని ఎలా ఎదురుకొన్నాడు అనే విషయంలో అందరికి క్లారిటీ ఉంది. 

రాయుడు ప్రత్యేకమైన టాలెంట్ కల్గిన ఆటగాడు. అతడి కెరీర్ మరింత గొప్పగా ఉండాల్సింది. ముగింపు ఇలా ఉండాల్సింది కాదు. తప్పు నీది కాదు రాయుడు.. జీవితం అంటే ఇదే.నీ భవిష్యత్తు మరింత బావుండాలని కోరుకుంటున్నా అంటూ సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. 

అలాగే బీసీసీఐ తీరుని కూడా సిద్దార్థ్ తప్పుబట్టాడు. బీసీసీఐ విధానాల వల్ల ఎందరో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్స్ మరుగునపడిపోతున్నారని వ్యాఖ్యానించాడు.