బలవంతంగా అబార్షన్ మాత్రలు... యువతి మృతి

Published : Jul 03, 2019, 03:49 PM IST
బలవంతంగా అబార్షన్ మాత్రలు... యువతి మృతి

సారాంశం

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెకు మాయామాటలు చెప్పి తన లైంగిక కోరికను తీర్చుకున్నాడు. ఆమెను బెదిరించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెకు మాయామాటలు చెప్పి తన లైంగిక కోరికను తీర్చుకున్నాడు. ఆమెను బెదిరించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా వాడి నిర్వాకం వల్ల యువతి గర్భం దాల్చింది. దీంతో... ఆమె చేత అబార్షన్ మాత్రలు మింగించాడు. అయిటే.. అవి వికటించి యువతి కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి  చెందిన ఓ యువతిని ప్రేమ పేరిట పక్కింటి కుర్రాడు ఆకర్షించాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక లోబరుచుకున్నాడు. పలుమార్లు ఇలానే ఆమెను బలవంతం చేసి తన కోరికలను తీర్చుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో అతను యువతిని అబార్షన్ చేయించుకోవాలని బలవంతం చేశాడు. యువతి అంగీకరించకపోవడంతో బయటకు వెళ్దామని చెప్పి యువతిని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అక్కడ యువతికి బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించాడు. అవి వికటించి వెంటనే యువతి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. నిందుతుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu