అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను అంబోలీ పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తరువాత బెయిల్ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. కాగా.. భాగ్యశ్రీ 'మేనే ప్యార్ కియా' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఇదే సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' అనే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. 

తన చిన్ననాటి స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్న తరువాత భాగ్యశ్రీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల ఆమె కుమారుడు అభిమన్యు దాసాని 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయమయ్యారు. మార్చిలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.