తనకు ఎలాంటి రెస్ట్ అవసరం లేదని.. తాను అన్ని మ్యాచ్ లు ఆడాలని అనుకుంటున్నట్లు టీం ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం టీం ఇండియా  బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో టీం ఇండియా విజయం సాధించింది. అయితే... ఈ మ్యాచ్ నాలుగు వికెట్లు సునాయాసంగా తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ప్రపంచకప్ లో ఆడటం ఇదే తొలిసారని.. చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అయితే... టీం ఇండియా సెమిస్ కి చేరింది కాబట్టి.. కొన్ని మ్యాచ్ లకు బుమ్రాను పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా దీనిపై బుమ్రా స్పందించాడు.

‘ఇది నా తొలి ప్రపంచకప్‌. నాకు ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలని ఉంది. నేనొక అనుభవం కలిగిన బౌలర్‌ అనుకోవడంలేదు. కొన్ని మ్యాచ్‌లు ఆడనని చెప్పడం లేదు. నేనెప్పుడు ఆడటానికే ఇష్టపడుతాను. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ సంతోషం ఉంటుంది.’ అని విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదని తెలిపాడు. అంతేకాకుండా తాను నెట్ ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తానని చెప్పాడు. బ్యాటింగ్ చేసేది ఎవరనేది తాను పట్టించుకోనని.. కేవలం జట్టు విజయానికి ఏం చేయాలనేదానిపైనే దృష్టిపెడతానని  చెప్పాడు.