అమరావతి: చంద్రబాబునాయుడుకు అసెంబ్లీ వేదికగానే అబద్దాలు చెప్పే అలవాటు ఉందని... చంద్రబాబు మాదిరిగా అసెంబ్లీ అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

బుధవారం నాడు  అమరావతిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు  రెండు రోజులపాటు  శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎ: పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు తప్పుడు డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అయితే చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన డాక్యుమెంట్‌పై ఆనాడు అధికార పార్టీకి చెందిన నేతలు కొద్దిసేపు అయోమయానికి గురైనట్టుగా ఆయన ప్రస్తావించారు.

మరునాడు ఇదే విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబునాయుడు ఏం చేశాడో చెప్పాడని ఆయన గుర్తు చేశారు. అసలు డాక్యుమెంట్ల ఆధారంగా వైఎస్ఆర్ అసెంబ్లీ మాట్లాడి చంద్రబాబు తప్పుడు డాక్యుమెంట్లను అసెంబ్లీలో చూపారని ఆయన చెప్పారు. అయితే తాను నకిలీ డాక్యుమెంట్  ఆధారంగా మాట్లాడినట్టుగా చంద్రబాబు కూడ అసెంబ్లీ వేదికగా ఒప్పుకొన్నాడని  ఆయన తెలిపారు.

తాము తప్పుడు డాక్యుమెంట్లను చూపితే లేదా తప్పుడు సమాచారం ఇస్తేనే ప్రభుత్వం సరైన సమాచారాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తోందని తాను తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టుగా బాబు అసెంబ్లీ వేదికగా చెప్పాడని ఆయన గుర్తు చేశారు.

కానీ చంద్రబాబు మాదిరిగా అబద్దాలు మాట్లాడకూడదని ఆయన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. వాస్తవాలను  మాట్లాడాలని ఆయన కోరారు. గత ఐదేళ్లలో నడిచినట్టుగా కాకుండా భిన్నంగా సభను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అసెంబ్లీలో చర్చలపై ఎమ్మెల్యేలకు సీతారాం క్లాస్