పదేళ్ల క్రితం వచ్చిన 'దేవ్ డీ' అనే సూపర్ హిట్ సినిమాలో నటించింది నటి మహీ గిల్. ఆ సినిమాతో మంచు గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల గురించి ఇప్పటివరకు నోరు మెదపలేదు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

తనకు మూడేళ్ల కూతురుందని చెప్పిన మహీ గిల్ ఇంకా తనకు పెళ్లి కాలేదని చెప్పింది. ఒక బిడ్డకు తల్లిగా ఉండడం ఎంతో గర్వంగా ఉందని.. ఈ ఏడాది ఆగస్ట్ నెలకు తన కూతురికి మూడేళ్లు వస్తాయని చెప్పింది.

మరి పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. పెళ్లి అవసరం ఏముంది..? ఇదంతా మన ఆలోచనాధోరణిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. పెళ్లి లేకపోయినా.. పిల్లలు, కుటుంబాన్ని కలిగి ఉండొచ్చని.. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇదొక సమస్య అని కూడా తాను అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

ప్రతీ ఒక్కరికీ జీవితం ఉంటుందని.. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని, పెళ్లి అనేది అందమైనదే.. కానీ పెళ్లి చేసుకోవడమనేది పర్సనల్ ఛాయిస్ అని చెప్పుకొచ్చింది. 'దేవ్ డీ' సినిమా తరువాత ఈ బ్యూటీ 'సాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్' సిరీస్ సినిమాలతో మహీ గిల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.