ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ఆరోపించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్... సీఎం జగన్ పై విమర్శలు చేశారు. పొదుపు పేరిట పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దను తీసేసారని మండిపడ్డారు. అనంతరం వైఎస్ హయాంలో జరిగిన అవినీతి మంత్రి బొత్స సత్యనారాయణకు బాగా తెలుసంటూ ఎద్దేవా  చేశారు.

‘జగన్ గారు..ఆ రోజుల్లో మీరు క్విడ్ ప్రో కోలో బిజీ కాబట్టి మీకు ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకల గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఈనాటి సమీక్షలో మీతో పాటు కూర్చున్న బొత్స సత్యనారాయణగారిని అడిగుంటే, 14 లక్షల ఇళ్లను కట్టకుండానే బిల్లులు తీసుకున్న అవినీతి గురించి వివరించేవారు.’ అంటూ లోకేష్ సెటైర్ వేశారు.

మరో ట్వీట్ లో... ‘2014కు ముందు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టేందుకు రూ.11 వేల కోట్లు కేటాయించి, అందులో రూ.7,759 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. అందులోనూ లబ్దిదారులకు రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టి మిగతా రూ.4150 కోట్లు దోపిడీ చేశారు. పేదల ఇళ్ళ నిర్మాణంలో అవినీతికి పరాకాష్ట అది.’ అని పేర్కొన్నారు.

అనంతరం తన తండ్రి, మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రతి పేదకూ సొంత ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో @ncbn గారు పేదల కోసం ధనవంతుల ఇళ్ళకు తీసిపోని అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్ళు కట్టించి ఇచ్చారు. మూడు విడతల్లో 8,00,346 ఇళ్ళు పంపిణీ చేశారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం.’ అని ట్వీట్ చేశారు. 

‘కానీ మీరు మీ తండ్రి పాలనలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళ వంటి నాసిరకమైన ఇళ్ళలోనే పేదలు ఉండాలని భావిస్తున్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు పేదలకు అనవసరమని మీరు ’ అంటూ జగన్ పై విమర్శలు చేశారు.