టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు.
టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. తన బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేస్తూనే... తన మంచి మనుసుతో అభిమానుల మనసులను రోహిత్ గెలుచుకుంటున్నాడు.
ఇంతకీ మ్యాటరేంటంటే... మంగళవారం ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సిక్సర్ల మోత మోగించాడు. ఈ నేపథ్యంలో... ఓ సిక్సర్ కొట్టినప్పుడు బంతి వెళ్లి ఓ మహిళా అభిమానిని తాకింది. ఈ విషయాన్ని గుర్తించిన రోహిత్ మ్యాచ్ అనంతరం ఆమెను పరామర్శించారు. తన జ్ఞాపకంగా ఆ అభిమానికి సంతకం చేసిన టోపీని కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే రోహిత్ కి అభిమానులు ఎక్కువ అంటూ పొగిడేస్తున్నారు.
ఇక, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తర్వాత ఒకే ప్రపంచ కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన హిట్‌మ్యాన్ గత ప్రపంచకప్‌లో బంగ్లాపై ఒక సెంచరీ చేశాడు. దీంతో కలిపి రోహిత్ చేసిన మొత్తం శతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ విషయంలో 6 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు.
