టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం బాబును కలిసేందుకు పలువురు మహిళా కార్యకర్తలు వచ్చారు. ఈ సమయంలో చంద్రబాబును చూడగానే వారు భావోద్వేగానికి గురయ్యారు.

పార్టీ అధికారంలోకి రాలేదని వారు కన్నీరుపెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు మహిళా కార్యకర్తలను ఓదార్చారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని స్పష్టం చేశారు. కుప్పం నుంచి తనను వరుసగా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆయన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేవలం మండల స్థాయి అధికారులే సమావేశానికి హాజరుకావడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.