సరిహద్దులో  శత్రువులపై  యుద్ధం చేయడమే సులభమని కాంగ్రెస్ పార్టీని నడపడం చాలా కష్టమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  అభిప్రాయపడ్డారు


హైదరాబాద్: సరిహద్దులో శత్రువులపై యుద్ధం చేయడమే సులభమని కాంగ్రెస్ పార్టీని నడపడం చాలా కష్టమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మేం ఎవరితో పొత్తులు పెట్టుకొంటే టీఆర్ఎస్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వంద సీట్లకు పైగా విజయం సాధిస్తామని ప్రకటించిన కేసీఆర్... టీడీపీతో పొత్తు అనగానే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజా కూటమి( మహా కూటమి) సీట్ల సర్ధుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వంటి విషయాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించారు.

సరిహద్దులో శత్రువులతో యుద్ధం చేయడమే సులభమన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలోని అందరినీ కలుపుకొని పోవడం అంతా ఆషామాషీ వ్యవహరం కాదన్నారు. బోర్డర్‌లో సైనికుడిగా పనిచేయడమే సులభమన్నారు. డిసెంబర్ 12వ తేదీన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు తాము అంతర్గతంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఉత్తమ్ చెప్పారు.

ప్రచారంలో తాము వెనుకబడలేదన్నారు. వ్యూహం ప్రకారంగానే తమ కూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకొన్నారని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగిన ఇదే విషయం చెబుతున్నారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య పోరుగా ఉత్తమ్ అభివర్ణించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఈ నాలుగేళ్ల పాటు దోచుకొందని ఉత్తమ్ ఆరోపించారు. నియంతగా కేసీఆర్ తెలంగాణను పాలిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకే కలిసిరావాలని అన్ని పార్టీలను కోరామన్నారు. ఇందులో భాగంగానే కూటమిని ఏర్పాటు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

నిజామాబాద్ సభలో కేసీఆర్ తనపై వ్యక్తిగతంగా దూషించారని ఆయన చెప్పారు.కేసీఆర్ వాడిన భాషనే తాను కూడ ఉపయోగించినట్టు ఆయన చెప్పారు.. సీఎం హోదాలో ఇష్టారీతిలో మాట్లాడొచ్చా అని ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికల తర్వాత తమకు టీడీపీతో ఎలాంటి శతృత్వం లేదన్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ లోపల, బయట టీడీపీతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

2004లో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నందున తెలంగాణలోని సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేశారని చెప్పారు. కానీ, అంతకుముందు సెటిలర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో రాష్ట్రంలో సుమారు 4500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. 

రైతులకు ఏక కాలంలో రుణమాఫీ డబ్బులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కార్ కారణమైందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సమయంలో రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తం కాకూడదనే ఉద్దేశ్యంతోనే రైతు బంధు పథకాన్ని కేసీఆర్ ముందుకు తెచ్చాడన్నారు. తమ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రైతు బంధు పథకాన్ని కొనసాగించడంతో పాటు కౌలు రైతులకు కూడ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.


కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని మెగావాట్ల విద్యుత్‌ను తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో నిర్మించిన పవర్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.2014లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడ కేసీఆర్ అమలు చేయలేదని చెప్పారు. విలాసవంతమైన జీవితాన్ని కేసీఆర్ కుటుంబసభ్యులు గడిపారని ఆయన విమర్శించారు.

నేరేళ్లలో దళితులను చిత్రహింసలు పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కార్‌దేనన్నారు. భూపాలపల్లిలో గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొన్నప్పుడు లేని తప్పు.... తమ పార్టీ పొత్తు పెట్టుకొంటే ఎందుకు తప్పు అవుతోందని ఆయన ప్రశ్నించారు.ఎవడితో పొత్తు పెట్టుకొంటే మీకు ఎందుకు అని కేసీఆర్ ను ప్రశ్నించారు. వంద సీట్లలో విజయం సాధిస్తామని చెబుతున్న కేసీఆర్ కు టీడీపీతో పొత్తు అనగానే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎందుకు మీకు లాగులు తడుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

కూటమి గెలిస్తే అమరావతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుందనే విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ వద్ద ఉందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, మోడీలు కలిసే ఉన్నారని ఆయన చెప్పారు. ఎల్. రమణ,చాడ వెంకట్ రెడ్డి, కోదండరామ్, నేను ఆంద్రావాళ్లమా అంటూ ఆయన ప్రశ్నించారు.

మహా కూటమి విజయం సాధిస్తే హైద్రాబాద్‌లో ప్రజల సమస్యలను పరిష్కరించేందకు పెద్ద పీట వేస్తామన్నారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మెట్రో రైలు ఛార్జీలను మరింత తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.

నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన తప్పులపై ఏం చేయాలో అదే చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత సీఎం ఎవరనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

మాట్లాడుకుందాం, రా..: అలిగిన సిపిఐ నేతలకు ఉత్తమ్ ఫోన్

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?