Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్ కి 'ఎస్వీఆర్' దొరికాడు ! నాగబాబు కాదు

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు, ఎస్వీఆర్ కు ఉన్న అనుబంధం తెలుగువారందికీ తెలిసిందే. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పౌరాణికాల్లో వీరిద్దరూ పోటా పోటిపడి మరీ పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసేవారు

svr's role from ntr finalized
Author
Hyderabad, First Published Nov 20, 2018, 9:32 AM IST

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు, ఎస్వీఆర్ కు ఉన్న అనుబంధం తెలుగువారందికీ తెలిసిందే. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పౌరాణికాల్లో వీరిద్దరూ పోటా పోటిపడి మరీ పాత్రల్లోకి పరకాయప్రవేశం చేసేవారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ కు ఖచ్చితమైన స్దానం ఉంటుందనేది అందరూ ఒప్పుకునే విషయం. కానీ ఆ పాత్ర ఎవరు వేస్తారనేది బయోపిక్ ప్రారంభమైన నాటి నుంచి దర్శక,నిర్మాతలకు పెద్ద క్వచ్చిన్ గా కనిపిస్తూ వస్తోంది. 

ముఖ్యంగా నిలువెత్తు విశ్వరూపం అయిన ఎస్వీ రంగారావు పాత్ర చాలా కీలకమైనది కావటంతో ఎంపిక విషయంలో దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈ పాత్రలో మొదట  'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్  వినిపించింది. ఎన్వీఆర్ లా భారీగా కనపడే నాగబాబు సరిపోతాడని ఆయనతో సంప్రదించినట్లుగా  మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోయినా .. ఇటీవల ఆయన గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించాలని వద్దనకున్నట్లు తెలుస్తోంది. 

మరో ప్రక్క  'మహానటి' సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, 'ఎన్టీఆర్' బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని కూడా మీడియా ప్రచారం చేసింది. కానీ బయోపిక్ లో కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారనే  క్రిష్ వద్దనుకన్నారట. 

ఇక వీరిద్దరూ కాకపోతే మరెవరని ఫైనలైజ్ చేసారు అంటే... ఓ రంగస్దల నటుడుని ఈ పాత్రకు తీసుకున్నారని తెలుస్తోంది. అచ్చు గుద్దినట్లు ఎస్వీఆర్ లా ఉన్న  ఓ థియేట‌ర్ ఆర్టిస్టుతో క్రిష్ ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారట.   త్వరలో జరగబోయే షెడ్యూల్ లోనే ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు ల మధ్య   సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ఇక ఈ చిత్రానికి కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.  జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

Follow Us:
Download App:
  • android
  • ios