దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ బాగా తెలుసు. వీలైనంతగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటాడు. ఇప్పటికే వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది.

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, పాటలు వైరల్ అవుతున్నాయి.తాజాగా ఆయన ట్విట్టర్ ఓ ఫోటో పోస్ట్ చేసి.. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగ్గా గుర్తుకురావడం లేదు.. వారెవరో గుర్తుచేసుకోవడంలోనాకు సహాయం చేయగలరా..? అంటూ అభిమానులను ప్రశ్నించాడు. 

ఫోటోలో 'నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్' అని క్యాప్షన్ ఇచ్చాడు. పోస్టర్ కి 'వెన్నుపోటు' అనే టైటిల్ కూడా ఇచ్చాడు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ ని కట్టప్ప చంపే సీన్ లో ప్రభాస్ మొహాన్ని సీనియర్ ఎన్టీఆర్ తో, కట్టప్ప ముఖాన్ని చంద్రబాబు నాయుడుతో ఉన్నట్లుగా మార్చేశాడు. పైగా చంద్రబాబు మొహానికి ఆకుపచ్చ రంగు వేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడని పరోక్షంగా వెల్లడించాడు.

ఈ పోస్టర్ చూసిన వర్మ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్వీట్లు పెట్టడంలో నిన్ను మించినవారు లేరంటూ వర్మని పొగుడుతున్నారు. మరికొందరు సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన క్లిప్పింగ్స్ ని వర్మ ట్వీట్ కి జత చేస్తున్నారు. 
 

ఇవి కూడా చదవండి..

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!