- Home
- Entertainment
- Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Rashmika Mandanna: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రష్మిక ఒకప్పుడు విజయ్ కు ఇచ్చిన వార్నింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది ఓ పాత ఇంటర్వ్యూ వీడియో. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందమైన జంట
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ లో అందమైన కపుల్ గా మారిపోయారు వీరిద్దరూ. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, నాగ చైతన్య - శోభితా ధూళిపాల వంటి సెలెబ్రిటీ జంటల్లో విజయ్ - రష్మిక కూడా చేరిపోయారు. అయితే వీరికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రేమ పెళ్లి అంతా సీక్రెట్
వీళ్లిద్దరు తొలిసారి గీత గోవిందం సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో వీరిద్దరికి అభిమానులు పెరిగిపోయారు. అలాగే వీరి మధ్య స్నేహం కూడ పెరిగింది. ఇక ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారని చెప్పుకుంటారు. అప్పట్నించి తమ ప్రేమను సీక్రెట్ గానే ఉంచారు. కానీ వారు పెట్టిన ఫోటోల వల్ల ఈ జంట దొరికిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఇతర దేశాల్లో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. గతేడాది ఎంగేజ్ మెంట్ చేసుకుని కూడా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా ఇప్పుడు వీరి పెళ్లి, రిసెప్షన్ అన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు ఓ పాత వీడియో ట్రెండవ్వడం మొదలైంది.
నీతో సినిమాలు చేయను
డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో జరిగిన ఇంటర్య్వూలోని క్లిప్ ఇప్పుడు వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ రష్మికను చాలా ఆటపట్టించాడు. దీంతో కాస్త సీరియస్ అయిన రష్మిక 'నీతో ఏ సినిమాలోనూ కలిసి నటించను. నువ్వే నాకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది చూసుకో, నేను నీతో కలిసి నటించకపోతేనే నా విలువ నీకు తెలుస్తుంది చూడు' అని అంటుంది.
రష్మిక ఫైట్
ఆ ఇంటర్య్వూలోనే రష్మిక మాట్లాడుతూ 'నువ్వు ఎవరితోనైనా సినిమాలే చేసుకో, ఎవరితోనైనా సినిమాకు సైన్ చేయించుకో. నేను మాత్రం నీతో ఏ సినిమాకు సైన్ చేయను' అని రష్మిక సరదాగా కోప్పడింది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమాలోనే కలిసి నటించనని చెప్పిన రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించబోతోంది.
.

