దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేయగానే జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. కానీ ఆర్ధిక కారణాల వలన సినిమాను మధ్యలోనే ఆపేశారు. రీసెంట్ గా సినిమాను మళ్లీ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని బయటపెట్టబోతున్నట్లు వెల్లడించాడు వర్మ.

ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీపార్వత దగ్గర ముందే అనుమతి తీసుకున్నాడు వర్మ. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఆమె కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమా తీసే ముందు తనకు స్క్రిప్ట్ మొత్తం ఒకసారి చూపించాలని లక్ష్మీపార్వతి కండీషన్ పెట్టింది. 

ఈ కండీషన్ గురించి వర్మ దగ్గర ప్రస్తావించగా.. స్క్రిప్ట్ లక్ష్మీపార్వతికి చూపించే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. 'నేనొక కథ చెప్పి మరొక కథ తీస్తే పరిస్థితి ఏంటి..? సినిమా అనేది పరస్పర నమ్మకంతో ముందుకు వెళ్లాలి. నన్ను లక్ష్మీపార్వతి నమ్మితే చాలు.. స్క్రిప్ట్ మాత్రం ఆమెకి చూపించే ప్రసక్తే లేదని' అన్నారు.

అలానే ఈ సినిమాకి క్రిష్ తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధం లేదని అన్నారు. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుండి ఏయే పాత్రలు ఉన్నాయో.. అన్ని పాత్రలు సినిమాలో ఉంటాయని అన్నారు. 

సినిమాలో అందరూ కొత్త నటీనటులే కనిపిస్తారని కొన్ని పాత్రలకు స్టార్ డం అవసరం లేదని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.  

ఇవి కూడా చదవండి.. 

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!