మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అప్పుడప్పుడు మనకొక డైలాగ్ వినిపిస్తుంటుంది. అది ఎంతవరకు నిజమో చెప్పలేము గాని కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉండే వ్యక్తిని మరోచోట చూసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వర్మ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో కూడా అందరికి అలాంటి ఆలోచనను కలిగించింది. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పిన వర్మ వెంటనే చంద్రబాబు లా కనిపిస్తున్న ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. ఆ చిన్న ఫుటేజ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అతని వివరాలు తెలిపినా, పట్టించినా లక్ష ఇస్తానని చెప్పిన వర్మ అనుకున్నట్టుగానే ఒక యువకుడి సాయంతో పట్టేశాడు. ఒక హోటల్ లో సర్వర్ లో కనిపిస్తున్న అతన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. 

మొదట వర్మ వీడియో పోస్ట్ చేయగానే మార్ఫింగ్ చేసిందని అంతా అబద్దమని టాక్ వచ్చింది. అయితే కొంతమంది నెటిజన్స్ అతనికి సంబందించిన మరిన్ని వీడియోలను పోస్ట్ చేయగా వర్మ చెప్పింది నిజమే అన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా ఇంటర్నెట్ లో ట్రేండింగ్ గా మారింది. కింద ఇచ్చిన వీడియోలో వర్మ కోరుకున్న చంద్రబాబును క్లారిటీగా చూడవచ్చు.