సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఆయన తను నిర్మిస్తోన్న 'భైరవగీత' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా కంటే ఆయన డైరెక్ట్ చేస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి సంబంధించి ఆయనకి ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చీకటి కోణాన్ని చూపిస్తానని వర్మ చెప్పాడు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత చోటుచేసుకున్న సంఘటనలు, వెన్నుపోటు రాజకీయాలను ఈ సినిమా కథలో భాగమని సమాచారం. అంటే ఈ సినిమా వివాదాలకు దారి తీయడం ఖాయమనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమా తీస్తున్నాం కదా అని లక్ష్మీపార్వతి అనుమతి ఉంటే సరిపోతుందని వర్మ.. ఎన్టీఆర్ ఫ్యామిలీని సంప్రదించలేదు. స్క్రిప్ట్ ముందే చూపించాలని లక్ష్మీపార్వతి కండీషన్ పెట్టినా వర్మ దాన్ని కొట్టిపడేశాడు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తరువాత కూడా ఆమెకి చూపిస్తాడని చెప్పలేం. కాబట్టి ఆ విధంగా వర్మ, లక్ష్మీపార్వతిల మధ్య సఖ్యత చెడే అవకాశం ఉంది.

ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఈ బయోపిక్ కి సంబంధించి ఎవరినీ సంప్రదించలేదు. బయోపిక్ కి సంబంధించిన బాలయ్యని కలిశారా..? అంటే లేదు అని సమాధానం చెప్పాడు వర్మ. ఇప్పుడు బాలయ్య సైలెంట్ గా ఉన్నా.. విడుదలకు ముందు కచ్చితంగా ఏదోక మెలిక పెడతారని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ ఈ బయోపిక్ ని కచ్చితంగా విడుదల చేయాలని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందు వస్తుందో లేదో చూడాలి!  

ఇవి కూడా చదవండి.. 

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!