Asianet News TeluguAsianet News Telugu

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా వెల్లడించాడు. 

ram gopal varma sensational comments on lakshmies ntr
Author
Hyderabad, First Published Oct 19, 2018, 1:13 PM IST

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా వెల్లడించాడు. ''ఎన్.టి.రామారావు గారి నిజమైన అభిమానులకి నా బహిరంగ ప్రకటన. సినిమా అనేదానికి సరైన నిర్వచనం జీవితానికి అద్దం పట్టడం. జీవితానికి అర్ధం నిజంగా జీవించడం. అసలు నిజానికి నిజంగా జీవించే వారికి మరణం అనేది ఉండదు.

ఎందుకంటే అలాంటి వారు భౌతికంగా మరణించినా.. వారిని ప్రేమించే మనుషుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.. ఎన్టీఆర్ గారి మీద సినిమా తీయడానికి ముఖ్య కారణం ఆయన జీవితంలో అత్యంత భావోద్వేగమైన ఘట్టాలు ఉండడం వలన.. ఆ ఘట్టాలు అన్నింటిలో ముఖ్యమైన ఘట్టం.. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం తరువాత ఉద్భవించిన కొన్ని అత్యంత కీలకమైన విపత్కర పరిణామాలు.

అందుకనే ఈ సినిమాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కేవలం ఒక సినిమా అనడం సినీ కళామతల్లిని, ఎన్టీఆర్ గారిని కూడా అవమానించినట్లే.. 
ఎందుకంటే ఇది ఒక జీవిత సత్యాన్ని చెరపడం కోసం చచ్చేంత ప్రయత్నం చేసినా.. చేరపలేకుండా చేయడానికి కెమెరాతో వేయబోతున్న అతి కచ్చితమైన రౌద్ర ముద్ర. లక్ష్మీ పార్వతి గారి గురించి నాకు వేరు వేరు మంది వేరు వేరు అభిప్రాయాలని , వేరు వేరు ఉదంతాలను చెప్పారు. వారు తెలిసి చెప్పారో.. తెలియక చెప్పారో.. రకరకాల కారణాలు ఉండొచ్చు.

కానీ వాదించే దానికి వీలు లేని పూర్తి నగ్న సత్యమేమిటంటే ఎన్టీఆర్ గారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి గారు గురించి ఎనలేని గౌరవంతో  మాట్లాడారు. అందుచేత ఆమెని అవమానిస్తే.. సాక్షాత్తు ఎన్టీఆర్ ని అవమానించినట్లే.. అలా అని నేను ఎవరో ఒకరి మాటలే వినడం లేదు.. లక్ష్మీ పార్వతి నుండి ఆమె ఇంట్లో అప్పట్లో పని చేసిన పనివాళ్లు, పార్టీ మెంబర్లు ఆమె శత్రువులు అందరితో గూడంగా ఇంటర్వ్యూలు జరిపి కళ్ళు బయర్లు గమ్మే నిజాన్ని లోతుగా తవ్వి బయటకి తీశాను.

సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా లక్ష్మీపార్వతిని పిలిచాను కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా ఉంటుందని అనుకుంటే పొరపాటే ఎందుకంటే నేను సినిమా తీసేది ఆమె కోసం కాదు.. ఎన్టీఆర్ గారి గురించి. ఆయన మీదున్న గౌరవం మూలాన ఆవిడని గౌరవించి ఆయన మీదున్న  గౌరవాన్ని నిలబెట్టడం నిజమైన అభిమానుల కనీస బాధ్యత. ఆవిడని  పిలిచిన ఒక కారణం ఎన్టీఆర్ భార్యగా, ఆయన మీదున్న గౌరవంతో.. రెండో కారణం సినిమాలో ఆమెది చాలా చాలా ముఖ్య పాత్ర.

ఎవరి పాయింట్ ఆఫ్ లో వ్యూలో సినిమా ఉంటుందనే దానికి నా సమాధానం కేవలం నిరూపించగలిగే నిజాల పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఉంటుందని చెప్పగలను. జనవరి 24న విడుదల కాబోతున్న ఈ సినిమా వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పినా మీరు నమ్మరు కాబట్టి చెప్పను. ఎన్టీఆర్ జీవితం మీద ఎన్ని సినిమాలు వచ్చిన ఆయన ఆశీస్సులు మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కి మాత్రమే ఉంటాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలను ఇది నా ఓపెన్ ఛాలెంజ్'' అంటూ చెప్పుకొచ్చారు. 

 

ఇది కూడా చదవండి.. 

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన


ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

 

 

Follow Us:
Download App:
  • android
  • ios