MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !

Vijay Trisha: దళపతి విజయ్ అభిమానులకు కోపం తెప్పించిన త్రిష, ఆమె పెట్టిన ఒక్క పోస్ట్.. అంత రచ్చ చేసిందా? !

సౌత్ స్టార్ హీరో..  తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, విజయ్ విడాకుల వదంతులకు నటి త్రిష పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ ఆజ్యం పోసింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది? త్రిష చేసిన రచ్చ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 08 2026, 06:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్య సంగీతతో విడాకులు?
Image Credit : X

భార్య సంగీతతో విడాకులు?

సౌత్ స్టార్ హీరో,  విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో కొత్త పార్టీ పెట్టి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ టైంలో ఆయనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఆయన వ్యక్తిగత జీవితంపై వదంతులు ఎక్కువయ్యాయి. తన భర్త విజయ్ ఒక నటితో కలిసి విదేశాలకు వెళ్తున్నారని ఆరోపిస్తూ, భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారని వార్తలు వచ్చాయి. 

ఆ నటి పేరు చెప్పకపోయినా, కోర్టులో చెబుతానని ఆమె అన్నట్లు ప్రచారం జరిగింది. ఆ నటి త్రిషనే అని అందరూ అనుకుంటున్న టైంలో, విజయ్, త్రిష కలిసి కనిపించడం ఈ చర్చను మరింత పెద్దది చేసింది.

24
పెళ్లికి కలిసి వెళ్లిన విజయ్, త్రిష
Image Credit : Asianet News

పెళ్లికి కలిసి వెళ్లిన విజయ్, త్రిష

చెన్నైలో AGS సినిమాస్ అధినేత కల్పాతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి మాత్రం నటుడు విజయ్, నటి త్రిషపైనే ఉంది. ఇద్దరూ కలిసి ఈ వేడుకకు రావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Related Articles

Related image1
Trisha Home Tour : చెన్నై, హైదరాబాద్‌లో ఇంద్రభవనాల్లాంటి త్రిష ఇళ్లను చూశారా? ఎలా ఉంటాయంటే?
Related image2
Vijay Trisha: త్రిష - విజయ్ కి షాక్ ఇచ్చిన బాడీగార్డ్, ఇద్దరి గురించి అతను ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా?
34
సంగీత స్థానంలో త్రిష?
Image Credit : social media

సంగీత స్థానంలో త్రిష?

కల్పాతి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ వేడుకకు విజయ్, త్రిష ఒకే కారులో వచ్చారు. నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించడం అక్కడున్న వారిని మరింత ఆకర్షించింది. 

సాధారణంగా ఇలాంటి ముఖ్యమైన వేడుకలకు విజయ్ తన భార్య సంగీతతో కలిసి వస్తారు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో త్రిష కనిపించడంతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. 'సంగీత లేకపోతే త్రిషనా?' అంటూ విజయ్‌పై విమర్శలు కూడా చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు.

44
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్
Image Credit : stockPhoto

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్

ఈ నేపథ్యంలో, నటి త్రిష పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ విడాకుల వివాదాన్ని మళ్లీ రాజేసింది. పెళ్లికి వెళ్లిన డ్రెస్‌తో దిగిన ఫోటోను పంచుకుంటూ, "Thank you for always being my go-to people" అని త్రిష క్యాప్షన్ పెట్టారు. దీనికి తన స్టైలిస్ట్, ఇతర బ్రాండ్లను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ తర్వాత, విజయ్‌పై ఉన్న నమ్మకం పోయిందంటూ తమిళనాడు వ్యాప్తంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష మాటలు, విజయ్ చేతలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. ముందు ముందు ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Related Stories
Recommended image1
Trisha Home Tour : చెన్నై, హైదరాబాద్‌లో ఇంద్రభవనాల్లాంటి త్రిష ఇళ్లను చూశారా? ఎలా ఉంటాయంటే?
Recommended image2
Vijay Trisha: త్రిష - విజయ్ కి షాక్ ఇచ్చిన బాడీగార్డ్, ఇద్దరి గురించి అతను ఇచ్చిన హింట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved