ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయనక్కర్లేదు . ప్రమోషన్ కోసం ఆయనతో సినిమా చేసే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పనిలేదు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయనక్కర్లేదు . ప్రమోషన్ కోసం ఆయనతో సినిమా చేసే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన సినిమాలకు ఆయనే వేసే ట్వీట్లు, టీవీ షోల్లో చేసే కామెంట్సే బోలెడంత బజ్ తీసుకొస్తూంటాయి.
సినిమా ఎనౌన్స్ చేసిన రోజు నుండే సంచలనం మొదలుపెట్టే వర్మ ఆ తర్వాత ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీని ఎంచుకుని గిచ్చటం మొదలెడతాడు. దాంతో ఏదో ఒక వర్గానికి కోపం రావటం...మీడియాకు ఎక్కడం, వర్మ ప్రాజెక్టుకు ఫ్రీగా పబ్లిసిటీ ఇవ్వటం మొదలెడతారు.
ప్రస్తుతం చేస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో కూడ ఇదే చేస్తున్నాడాయన. ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో సినిమా అంతో రచ్చ మొదలెట్టిన ఆర్జీవీ వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి తెలుగు దేశం పార్టీలో, అభిమానుల్లో కలకలం రేపాడు. వాళ్లంతా ఆయనపై కేసులు పెడుతుంటే రివర్స్ కౌంటర్లు వేస్తూ ఫుల్ పబ్లిసిటీ సంపాదిస్తున్నాడు. అయితే ఆ పబ్లిసిటీ చాలినట్లు లేదు. ఈ సారి ఏకంగా రియల్ ఫుటేజ్ ని తీసుకుని మరీ ఆ పాటకు యాడ్ చేసి ఓ వీడియోని వదిలారు.
ఎవరో అభిమాని చేసినట్లుగా బిల్డప్ ఇస్తూ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఎలాగైనా ఈ వెన్నుపోటు వివాదంతో సినిమా పట్ల జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనేలా చేయటం ఆయన ఆలోచన. పూర్తి స్దాయిలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ..ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియోకు ఖచ్చితంగా తెలుగు దేశం వర్గం నుంచి విమర్శలు,వివాదాలు వస్తాయి. దీంతో వర్మ తాను అనుకున్నది సాదించినట్లైంది.
Hey @kalyanimalik31 and @SiraSri This is NTR fan made emotional video pic.twitter.com/nzBSPO5bPz
— Ram Gopal Varma (@RGVzoomin) December 23, 2018
ఇవి కూడా చదవండి..
'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!
వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!
ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!
లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?
లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!
ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!
వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!
శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన
ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?
లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!
వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?
నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 24, 2018, 9:09 AM IST