వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడంటే ఎదో ఒక కొత్త వివాదానికి దారి తీస్తుందని అందరికి తెలిసిందే. చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలోకి వచ్చిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ కానుందని హడావుడి చేశాడు. ఇక నేడు ఒక వీడియో పోస్ట్ చేసి మరో కొత్త తరహా న్యూస్ కి తెరలేపాడు. 

హోటల్ లో వడ్డిస్తున్న ఒక వ్యక్తికి సంబందించిన ఫుటేజ్ ని ఉంచి ఎవరైనా సరే అతన్ని మొదటి సారి పట్టుకొని తనకు అప్పగించినా లేక ఫోన్ నెంబర్ ఇచ్చినా వివరాలు తెలియజేసినా వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. అతను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబులా ఉండటంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

అయితే ఆ ఫుటేజ్ ఎంతవరకు నిజమనేది వర్మకే తెలియాలి. ఎక్కడ పట్టుకొచ్చాడో గాని నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలుపెట్టనున్నట్లు శుక్రవారం ఎన్టీఆర్ - లక్ష్మి పార్వతి మరియు చంద్రబాబుకి సంబందించిన పోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.