వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా వర్మ తిరుపతికి వెళ్లి మరీ శ్రీవారిని దర్శించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయనతో పాటు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కూడా ఉండడం విశేషం.

అయితే దర్శనం అనంతరం వర్మ ప్రెస్ మీట్ ని నిర్వహించి సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించారు. లక్ష్మీపార్వతి గురించి చెప్పగలిగే ప్రత్యక్ష సాక్షి ఎన్టీఆర్‌ మాత్రమేనని, యూట్యూబ్ లో లక్ష్మీపార్వతి గురించి ఎన్టీఆర్‌ గొప్పగా మాట్లాడిన వీడియో చూశానని వర్మ అన్నారు.

నిజాలు నిరూపించగలిగే సినిమానే తీస్తున్నట్లు వెల్లడించారు. నిజాలు చూపించేలా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. అలాంటి కథానాయికలు శ్రీదేవి, జయసుధ, జయప్రదల్లో లేని ఆకర్షణ.. లక్ష్మీపార్వతిలో ఏముందని ఆశ్చర్యపోయినట్లు వర్మ చెప్పుకొచ్చాడు.

అంతటి ఆకర్షణని ఎన్టీఆర్‌ కాదనుకొని లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంతో ఆశ్చర్యపోయినట్లు, ఆ విషయం తన ఊహాకి అందలేదని వర్మ అన్నారు. 

ఇది కూడా చదవండి.. 

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన


ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!