- Home
- Entertainment
- Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్ చేయాల్సిందే
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్ చేయాల్సిందే
సమంత, నాగచైతన్య ఐదేళ్ల క్రితం విడిపోయారు. ఇప్పుడు ఎవరికి వారు రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. అయితే సమంతకి, చైతూ ఎంత భరణం ఇచ్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఏడేళ్ల ప్రేమ, పెళ్లి చేసుకున్న 4ఏళ్లకి విడిపోయిన సమంత, చైతన్య
నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. `ఏ మాయ చేసావె` సినిమా సమయంలో ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్‌లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఉన్నన్ని రోజులు బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. కానీ సరిగ్గా నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు.
రెండో పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్న సమంత, నాగచైతన్య
సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంటే, నాగచైతన్య.. మరో నటి శోభితా దూళిపాళ్లని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితంలో హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. చైతూ మాస్ సినిమాలతో దూసుకుపోతున్నారు. సమంత `మా ఇంటి బంగారం` మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
విడాకుల తర్వాత స్ట్రగుల్‌అయిన సమంత
ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎంత భరణం తీసుకుందనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫిగర్ ఇప్పుడు షాకిస్తోంది. సమంత, నాగచైతన్య ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి విడిపోయారు. అయితే దీని వెనక ఇద్దరి మధ్య చాలా సంఘర్షణ జరిగింది. ముఖ్యంగా సమంత చాలా స్ట్రగుల్ అయ్యింది. ఈ క్రమంలో తన అనారోగ్యానికి గురయ్యింది. మయోసైటిస్‌తో దాదాపు రెండేళ్లు పోరాడిన విషయం తెలిసిందే.
సమంత రెండు వందల కోట్ల భరణం తీసుకుందా?
అక్కినేని ఫ్యామిలీ సమంతకి భరణం కింద దాదాపు రూ.200కోట్లు ఆఫర్ చేశారట. ఆ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడినట్టు సమాచారం. కానీ సమంత తీసుకోలేదట. డబ్బుకి ఆమె విలువ ఇవ్వలేదని సమాచారం. తాను కూడా పాపులర్ నటినే కావడం, తాను సంపాదించుకోగలనే గట్ ఫీలింగ్‌తో వారి ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. అదే సమయంలో తనకు డబ్బు ముఖ్యం కాదు, రిలేషన్స్ ముఖ్యమనే విషయాన్ని చెప్పకనే చెప్పిందట సమంత.
భరణంపై సమంత కామెంట్
ఇదే విషయాన్ని సమంత కాఫీ విత్ కరణ్ షోలో తెలిపింది. కరణ్ జోహార్ ఎంత భరణం తీసుకున్నారనే ప్రశ్న అడగ్గా, తాను ఏమీ తీసుకోలేదని, తాను తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది. `మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. డైవర్స్ తీసుకున్న మొదట్లో బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. ఇప్పుడు గతంలో కంటే బలంగా ఉన్నాను` అని సమంత చెప్పింది. సాధారణంగా రెండు వందల కోట్లు అంటే ఎవరూ నో చెప్పరు. కానీ సమంత సింపుల్‌గా రిజెక్ట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఆమె గట్స్ మొక్కాల్సిందే అని అంటున్నారు నెటిజన్లు.

