అమరావతి ప్రాజెక్టు నుండి వైదొలిగిన మరో బ్యాంక్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 23, 2019, 5:59 PM IST
Highlights


నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

తెలిసీ తెలియక తప్పులు చేశా... గవర్నర్ భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ తో తనకు ఉన్న అనుబంధం ఎంతో పెద్దదని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం వీడ్కోలు సభలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను చిన్న తనంలో ఏపీలోని గవర్నర్ పేటలో నివాసం ఉన్నామని గుర్తు చేసుకున్నారు.

 

సవతి తల్లి కూతురిపై అత్యాచారం

అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. తోడబుట్టిన సొంత చెల్లెలుపై ఓ అన్న  అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలు మర్చిపోయి... రక్తం పంచుకు పుట్టిన  చెల్లిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

 

కారణమిదే: అమిత్‌ షాతో ఐఎఎస్ శ్రీలక్ష్మి భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో  ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఏపీలో డిప్యూటేషన్‌పై పని చేసేందుకు  అవకాశం కల్పించాలని  ఆమె కోరారు. ఇప్పటికే ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రితో ఆమె ఇవాళ భేటీ అయ్యారు.

 

చంద్రబాబు చేతిలో పేపర్ తీసుకొని కౌంటరిచ్చిన జగన్

అమరావతి: బలహీనవర్గాల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తీసుకొస్తే టీడీపీ అడ్డుకోవాలని భావిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు  వైఎస్ఆర్ చేయూత పథకంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శలపై ఏపీ సీఎం జగన్ కౌంటరిచ్చారు.

 

ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్: పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసన

న్యూఢిల్లీ:  కాశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మధ్యవర్తిత్వం వహించాలని ప్రధానమంత్రి మోడీ అభ్యర్ధించినట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విపక్షాలు మోడీ ప్రకటన కోసం  పట్టుబట్టాయి.

 

అసెంబ్లీ నుంచి సస్పెన్షన్.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

సస్పెన్షన్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. అధికార పార్టీ నాయకులు తీసుకువచ్చిన వీడియోని చూపించిన స్పీకర్.. తాము తీసుకువచ్చిన వీడియోలను కూడా చూపించాలని డిమాండ్ చేశామన్నారు. ఇరు పక్షాల వీడియోలను చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని తాము అంటే.. స్పీకర్ వినిపించుకోలేదన్నారు.

 

బిగ్ బాస్ ని బ్యాన్ చేయాల్సిందే.. యాంకర్ పోరాటం!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అన్నారు. సోమవారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నటి, యాంకర్ గాయత్రి గుప్తా పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మట్లాడారు.

 

రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదీ... సస్పెన్షన్ పై లోకేష్ కౌంటర్లు

సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో  గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడులపై సస్పెన్షన్ విధించారు. కాగా.. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు.

 

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

న్యూఢిల్లీ:  కర్ణాటక అసెంబ్లీలో  విశ్వాస పరీక్షలో  తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ బలపరీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. రెబెల్స్ పిటిషన్‌పై  విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

 

టీడీపీ నేత కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం

టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కరణం బలరాం ఇంట్లోని ఫర్నీచర్ తో పాటు కొన్ని కీలక ఫైళ్లు కూడా ధ్వంసమయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. 

 

వర్మ ఉచ్చులో రామ్, టెన్షన్ లో ఫ్యాన్స్ ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు పూరి జగన్నాథ్ ద్వారా రామ్ తో మాట్లాడించాడని చెప్తున్నారు. అయితే రామ్ ఇంకా సై అనలేదట. అయితే తను చెప్పిన కాన్సెప్టు ఖచ్చితంగా రామ్ కు నచ్చుతుందనే నమ్మకంతో వర్మ ఉన్నారట.

 

ఖబడ్డార్ చంద్రబాబూ! అదుపులో పెట్టుకోండి: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్

సీఎం జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక టీడీపీ కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా ఖబడ్డార్ ఖబడ్డార్ చంద్రబాబూ అంటూ రెచ్చిపోయారు. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో అంటూ తీవ్రంగా హెచ్చరించారు. 

 

దేవరకొండ మాటలకు పూరి జగన్ హర్ట్ అవుతాడా?

పూరి జగన్నాథ్  తో సినిమా గురించి విజయ్ దేవరకొండని అడిగితే.. అసలు అలాంటి ప్రాజక్టే కాదు, ఆలోచనే లేదని తేల్చి చెప్పేసాడు. పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినా విజయ్ దేవరకొండ కన్సిడర్ చేయకపోవటం చాలా మందికి షాక్ ఇచ్చిన విషయం. 

 

జగన్ సొంత జిల్లాలో కలకలం: జమ్మలమడుగులో 54 నాటు బాంబులు స్వాధీనం

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మరోసారి నాటుబాంబులు కలకలం రేపాయి. ముద్దనూర్ రోడ్ నెంబర్ 8 దగ్గర 14 నాటుబాంబుల లభ్యమవ్వడంతో స్థానికంగా  కలకలం రేపుతోంది. ఓ వెంచర్ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తుండగా 54 బాంబులు ప్రత్యక్షమయ్యాయి. 

 

అమరావతిని చంపేశారు, రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తున్నారు : చంద్రబాబు ఆవేదన

అమరావతి: అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ నుంచి బీసీ ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఎలా చెప్తారంటూ వైసీపీపై మండిపడ్డారు.  
 

షాకింగ్ : బోయ‌పాటి నెక్ట్స్ ఆ హీరోతోనా?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుకి నిర్మాత‌ అల్లు అర‌వింద్ పిలిచి సినిమా ఇచ్చారు. హీరోలు, నిర్మాత‌లు ముఖం చాటేస్తోన్న స‌మ‌యంలో అర‌వింద్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇవ్వటం గొప్ప విషయమే. అయితే ఛాన్స్ బ‌న్నీతో కాదు..అల్లు శీరీష్ తోనే సినిమా అని తెలుస్తోంది. ఆఫర్  కోసం ఎదురుచూస్తోన్న బోయ‌పాటి  వేరే దారి లేక ఓకే చేసాడంటున్నారు. 
 

మార్వెల్‌ స్కెచ్చా మజాకా! ‘అవతార్‌’ రికార్డ్ ఎగిరిపోయింది!

కలెక్షన్స్ యుద్దాలు మనకే కాదు హాలీవుడ్ లోనూ భారీగానే జరుగుతాయి. ఏ సినిమా హైయిస్ట్ కలెక్ట్ చేసింది అనేది ఎప్పటికప్పుడు రికార్డ్ గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీడియా మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో సిని నిర్మాణ సంస్దలు ఆ రికార్డ్ కోసం పోటీ పడుతూంటారు. 

 

మార్షల్స్ తో పంపి అవమానిస్తారా, నా హక్కులను హరిస్తారా ?: స్పీకర్ కు అచ్చెన్నాయుడు లేఖ

మంగళవారం శాసన సభలో తాను శాసన సభ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అయినా గానీ సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు పంపించి వేశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సీట్లోనే ఉన్నప్పటికీ తనను సస్పెండ్ చేయడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. ఎలాంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు.

 

అప్పుడు గుర్తొచ్చిన కాళ్ల నొప్పులు కుర్చీ ఎక్కగానే మరచిపోయారా..? : జగన్ పై లోకేష్ ఫైర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు మాజీమంత్రి నారా లోకేష్. 45ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు రూ.2000 పింఛన్ ఇస్తామని చెప్పిన జగన్ ఇచ్చిన మాట తప్పారంటూ విమర్శించారు. 

 

సీన్ చూడండి.. సీన్ చేయొద్దు.. హీరో రామ్ కౌంటర్!

'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఆదర్శంగా లేదని.. ఈ క్యారెక్టర్ కారణంగా ప్రేక్షకులు తప్పుదారి పట్టే ఛాన్స్ ఉందంటూ కొందరు చిత్రబృందాన్ని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ పెట్టారు. అవి చూసిన హీరో రామ్ తాజాగా కొన్ని కామెంట్స్ పెట్టాడు.

 

జగన్ శాసిస్తాడు, స్పీకర్ ఆచరిస్తాడు: మరో పులివెందుల పంచాయితీ అంటూ చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీని జగన్ శాసిస్తుంటే స్పీకర్ తూచ తప్పకుండా పాటిస్తాడని ఇదొక పులివెందుల పంచాయితీ అంటూ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులను ఎవరు తిట్టాలో ఎన్ని తిట్టాలో అన్ని వాళ్లే నిర్ణయించుకుంటారని తమకు మాత్రం మైకు ఇవ్వరన్నారు. ఇచ్చినా మధ్యలో  కట్ చేస్తారని ఆరోపించారు.  
 

 

'బిగ్ బాస్3' కంటెస్టంట్స్.. వీళ్ల గురించి ఈ విషయాలు తెలుసా..?

బుల్లితెర నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తాజాగా మూడో సీజన్ కూడా మొదలైంది. 15 మంది కంటెస్టంట్ లుగా పాల్గొన్నారు. వారిలో శ్రీముఖి, హేమ, టీవీ 9 జాఫర్ ఇలా కొంతమంది కంటెస్టంట్స్ గురించి తెలిసిందే. 

 

జగన్ కు మరో షాక్: అమరావతి ప్రాజెక్టు నుంచి మరో బ్యాంక్ వెనక్కి.

అమరావతి: అమరావతి ప్రాజెక్టు నుండి మరో బ్యాంకు వైదొలిగింది. అమరావతి ప్రాజెక్టు నుండి ప్రపంచ బ్యాంకు వైదోలిగిన వారం రోజులకే చైనాకు చెందిన బ్యాంకు వెనక్కు తగ్గింది.

 

శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన భారీ ముప్పు

శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఇండిగో విమానానికి భారీ ముప్పు తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్ వేపై వెళ్తుండగా.... విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.  పైలెట్ దీనిని గుర్తించి అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

 

 

కేసీఆర్‌‌కు షాక్: మున్సిపల్ బిల్లును వెనక్కి పంపిన గవర్నర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహాన్ షాకిచ్చారు. మున్సిఫల్ బిల్లును వెనక్కి పంపారు. విపక్షాల అభ్యంతరంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. 

 

మగాళ్లకి లేని ఇబ్బంది మాకెందుకు.. అనసూయ కామెంట్స్!

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 

వెలుగు చూసిన నిజం: కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రశాంత్ కిశోర్ ప్లాన్

హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు.

 

చిక్కుల్లో పడ్డ దర్శకుడు పూరిజగన్నాథ్!

గత వారం విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ తనదేనని హీరో, రచయిత ఆకాష్ అంటున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించాడు.

 

విషాదం: సినిమాకొచ్చి చిన్నారి మృత్యువాత

హైదరాబాద్: హైద్రాబాద్ ఆబిడ్స్‌లో  స్వప్న, సంతోష్ థియేటర్‌ నుండి నాలుగేళ్ల చిన్నారి కిందపడి మృతి చెందాడు.హైద్రాబాద్ ఆబిడ్స్‌లో స్వప్న సంతోష్ థియేటర్‌లో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో లయన్ సినిమా చూసేందుకు సోమవారం సాయంత్రం స్వప్న సంతోష్ థియేటర్ కు వచ్చాడు.

 

బ్యూటీషీయన్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లిలో బ్యూటీషీయన్ శిరీష మంగళవారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఆస్తి కోసం తల్లికి వేధింపులు: కొడుకు, కోడలుకు రెండేళ్ల జైలు

హైదరాబాద్: కన్నతల్లిని కష్టపెట్టిన కొడుకుకు కోర్టు జైలు శిక్ష విధించింది. తండ్రి చనిపోతే తల్లిని ఆదరించకపోగా ఇంటి కోసం బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మల్కాజిగిరి న్యాయస్థానం నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షను విధించింది.

 

 

 

 

click me!