వినయవిధేయరామ డిజాస్టర్ తర్వాత ఏ హీరో కూడా బోయపాటి శ్రీను తో చేయటానికి ఉత్సాహం చూపించటం లేదన్నది నిజం. చిన్న హీరోలతో ఆయన చేయరు. పెద్ద హీరోలు ఆయనతో చేయరు అంటున్నారు.దానికి తోడు ఆయన చెప్పే బడ్జెట్ వణుకు పుట్టింస్తుందని నిర్మాతలు దూరం పెడుతున్నారు. బాలయ్యతో ఆల్రెడీ రెండు హిట్స్ ఇచ్చాడు కదా అనుకుంటే అక్కడా అదే సమస్య ఎదురైంది. 

ఈ నేపధ్యంలో మన మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుకి నిర్మాత‌ అల్లు అర‌వింద్ పిలిచి సినిమా ఇచ్చారు. హీరోలు, నిర్మాత‌లు ముఖం చాటేస్తోన్న స‌మ‌యంలో అర‌వింద్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇవ్వటం గొప్ప విషయమే.  గ‌తంలో `స‌రైనోడు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ గీతా ఆర్స్ట్ కు ఇచ్చాడు కాబ‌ట్టే ఈ ఛాన్స్ అని అంతా భావించారు. మ‌ళ్లీ బ‌న్నీతోనే సినిమా ఉంటుంద‌ని రూమర్స్ స్టార్టయ్యాయి. కానీ అస‌లు విష‌యం అది కాద‌ని అర‌వింద్ క్యాంప్ నుంచి తెలిసింది.

ఈసారి ఛాన్స్ బ‌న్నీతో కాదు..అల్లు శీరీష్ తోనే సినిమా అని తెలుస్తోంది. ఆఫర్  కోసం ఎదురుచూస్తోన్న బోయ‌పాటి  వేరే దారి లేక ఓకే చేసాడంటున్నారు.  గ‌తంలో బోయ‌పాటి స్టార్స్ కాకుండా బెల్లంకొండ వంటి మీడియం రేజ్ హీరోల‌తో సినిమాలు చేసారు. అందుకే ఈసారి తన చిన్న కుమారుడు శిరీష్ కు హిట్ ఇచ్చే  బాధ్య‌త‌ల్ని బోయ‌పాటి చేతుల్లో పెట్టిన‌ట్లు వినిపిస్తోంది. 

ఈ వార్తే కనక నిజమైతే ఇప్పుడు శిరీష్ తన శరీరాన్ని మార్చుకోవాల్సిన టైమ్ వచ్చింది. సిక్స్ ప్యాక్ లేకపోతే బోయ‌పాటి ఒప్పుకోడు. ఆ బాడీని అడ్డంపెట్టి మాస్ కు నచ్చేలా హీరోని ఎలివేట్ చేస్తాడు బోయపాటి. హీరో ఇమేజ్ తో ప‌నిలేకుండా క్యారెక్ట‌ర్లు రాయిస్తున్నాడని సమాచారం.  జ‌య జానికి నాయ‌క బజ్జెట్ ఎక్కువ అవటంతో  క‌మ‌ర్శియ‌ల్ గా ఫెయిలైనా హీరో పాత్ర‌ను తెరపై చ‌క్క‌గా ఆవిష్క‌రించిన కలిసొచ్చింది. అలాంటి మ్యాజిక్ శిరీష్ విష‌యంలో రిపీట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు.