ఆంధ్రప్రదేశ్ తో తనకు ఉన్న అనుబంధం ఎంతో పెద్దదని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం వీడ్కోలు సభలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను చిన్న తనంలో ఏపీలోని గవర్నర్ పేటలో నివాసం ఉన్నామని గుర్తు చేసుకున్నారు.

తాను ఇదే ప్రాంతానికి మళ్లీ గవర్నర్ గా వస్తానని తాను ఆ సమయంలో ఊహించలేదని ఆయన అన్నారు.తాను ఐపీఎస్ పూర్తి అయిన తర్వాత మొదటి శిక్షణ అనంతపురంలోనేనని ఆయన అన్నారు. అనంతరం తనకు పునర్జన్మ ఇచ్చింది నంద్యాల అని చెప్పారు. ప్రమోషన్ అనంతరం ప్రకాశం వెళ్లామని చెప్పారు. ఇలా తనకు ఏపీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడారు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. జగన్ చాలా ప్రేమ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. తాను చూసిన మేరకు జగన్ టీ 20 మ్యాచ్ తరహాలో పాలన చేస్తున్నారని అన్నారు. ఈ కొన్ని రోజుల్లోనే జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ప్రతి బంతి ఫోర్ లేదా సిక్స్ కొడుతున్నారని అన్నారు.

జగన్ భార్య భారతి గురించి మాట్లాడుతూ... భారతి అమ్మ అంటే అందరికీ శక్తినిచ్చేదన్నారు. జగన్ కూడా అక్కడి నుంచే శక్తిని పొందుతున్నారని అనుకుంటున్నానని అన్నారు. జగన్-భారతిలు చాలా స్పెషల్ కపుల్ అని కొణియాడారు. 

‘‘ప్రణబ్‌ ముఖర్జీ చెప్పినట్లు... ప్రతి అంశంపైనా డిబే ట్‌, డిస్కషన్‌... ఆ తర్వాత డెసిషన్‌ జరగాలి. అది పా టించాలి. ఇక్కడున్న మంత్రులందరికీ, గతంలో పనిచేసిన కొందరికీ ధన్యవాదాలు. అధికారులకు ప్రత్యే క కృతజ్ఞతలు. రేపు కొత్త గవర్నర్‌ వస్తారు. నా బాధ్యత లేదు. కానీ ఒక్కమాట. నరసింహావతారం అంటే అలా వచ్చి పనిపూర్తి చేసి వెళ్లిపోయే అవతారం. పదేళ్లు ఉండదు. స్తంభం నుంచి బయటికొచ్చి పనిచేసి వెళ్లిపోయాడు. దురదృష్టవశాత్తూ నేను అలా కాదు. చాలాకాలం ఉన్నా. కానీ ఈ రాష్ట్రానికి నారసింహు డి మార్గదర్శకత్వం ఉంటుంది. కొన్ని తెలిసి చేసిన తప్పులున్నాయి. కొన్ని సమయాల్లో తె లియకుండా చేశా. క్షమాపణ అడుగుతున్నా. ప్రత్యేకించి సీఎం జగన్‌కు... గత 34రోజుల్లో మన మధ్య జరిగిన చర్చల్లో నా హద్దులు దాటిమరీ గట్టిగా చెప్పాను. నా కుమారుడి వయసన్న ఉద్దేశంతో చెప్పా. మీరు అవినీతిరహిత పాలనకు తెరతీశారు. మీ ప్రభుత్వం దీర్ఘకా లం ఉండాలి’’ అని అన్నారు