హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లిలో బ్యూటీషీయన్ శిరీష మంగళవారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం డోమూరు గ్రామానికి చెందిన శిరీష దంపతులు కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నారు. కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 4, ఎల్ఐజీ 27 ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. రోడ్ నెంబర్ 5లో సహజ బ్యూటీ పార్లర్ ను శిరీష నడుపుతోంది.

బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసేందుకు శిరీష అప్పులు చేసిందని బంధువులు చెబుతున్నారు. బ్యూటీ పార్లర్ కోసం ఓ వ్యక్తి నుండి రూ. 7 లక్షలు అప్పుగా తీసుకొంది.  ఈ అప్పు చెల్లించాలని ఓ రౌడీషీటర్  శిరీషను బెదిరించినట్టుగా పోలీసులు గుర్తించారు.

వారం రోజుల క్రితం రౌడీ షీటర్  శిరీష నడుపుతున్న బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్లి ఆహెను బెరదించినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు సీసీటీవీ పుటేజీని స్వాధీనం చేసుకొన్నారు. 

శిరీష కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులతో ఉన్నట్టుగా బంధువులు చెబుతున్నారు.మంగళవారం నాడు భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో  ఇంట్లోనే  శిరీష ఆత్మహత్యకు పాల్పడింది.శిరీష ఆత్మహత్య చేసుకొందా లేదా ఆమెను ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడ  పోలీసులు విచారణ చేస్తున్నారు.